Speaker election: కాంగ్రెస్ స్పీకర్ అభ్యర్థికి తృణమూల్ కాంగ్రెస్ మద్దతు..
- స్పీకర్ ఎన్నికలో కీలక పరిణామం..
- కాంగ్రెస్ అభ్యర్థికి తృణమూల్ సపోర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Speaker election: లోక్‌సభ స్పీకర్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఎన్డీయే తరుపున బీజేపీ ఎంపీ ఓం బిర్లా పోటీలో ఉండగా.. ప్రతిపక్ష ఇండియా కూటమి కాంగ్రెస్ ఎంపీ కే. సురేష్‌ని స్పీకర్ పోస్టుకు ప్రతిపాదించింది. దాదాపుగా 50 ఏళ్ల తర్వాత తొలిసారిగా స్పీకర్ పోస్టు కోసం ఎన్నికలు జరుగుతున్నాయి. సాధారణంగా అధికార, ప్రతిపక్షాలు ఏకగ్రీవంగా స్పీకర్‌ని ఎన్నుకుంటాయి. అయితే, ఈసారి డిప్యూటీ స్పీకర్ పోస్టు తమకు కావాలని ప్రతిపక్షాలు కోరాయి. ఇందుకు బీజేపీ ఒప్పుకోకపోవడంతో తాము కూడా స్పీకర్ పదవికి పోటీ చేస్తామని ఇండియా కూటమి తరుపున అభ్యర్థిని నిలబెట్టారు.
ఇదిలా ఉంటే, తమకు చెప్పకుండా ఏకపక్షంగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్( టీఎంసీ) అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే, ఈ రోజు టీఎంసీ కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
Read Also: Physical relations: అత్తతో శారీరక సంబంధానికి కోడలిపై ఒత్తిడి.. బ్లేడ్‌తో దాడి..
బలబలాలను పరిశీలిస్తే ప్రస్తుతం బీజేపీకి సొంతగా 240 ఎంపీల బలం ఉంది. మిత్రపక్షాలతో కలుపుకుంటే 293 ఎంపీల సంఖ్యా బలం ఉంది. దీనికి తోడు వైఎస్సార్సీపీకి చెందిన నలుగురు ఎంపీలు కూడా ఎన్డీయేకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో బలం 297కి పెరిగింది. ఇక ఇండియా కూటమికి 233 ఎంపీల మద్దతు ఉంది. సభలో మొత్తం 543 సభ్యులు ఉంటే, ఇటీవల రాహుల్ గాంధీ వయనాడ్ సీటుకు రాజీనామా చేయడంతో ప్రస్తుతం 542 సభ్యులు ఉన్నారు. స్పీకర్ ఎన్నికకు అవసరమైన ఓట్లు 271. బలాబలాలను పరిశీలిస్తే ఎన్డీయే పక్షం సునాయాసంగా స్పీకర్ పోస్టుని కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఇండియా కూటమిలో స్పీకర్ పోటీ ప్రతిపాదన చిచ్చు పెట్టింది. ఏకపక్షంగా కాంగ్రెస్ వ్యవహరించిందని తృణమూల్ అసంతృప్తి వ్యక్తం చేసింది.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!