IRCTC Tour: హైదరాబాద్ నుంచి ఉజ్జయిని టూర్… ఎంతంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IRCTC Tour: అధ్యాత్మిక భక్తుల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) పలు పర్యాటక ప్రాంతాలకు తీసుకెళుతూ స్పెషల్ ప్యాకేజీలను ఇస్తు్న్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఈ సారి హైదరాబాద్ టు ఉజ్జయిని టూర్‌ను ఏర్పాటు చేశారు. ఈ అధ్యాత్మిక పర్యటనలో భాగంగా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని, ఓంకారేశ్వర్, మహేశ్వర్, ఇండోర్ వెళ్లే పర్యాటకుల కోసం ఐఆర్‌సీటీసీ సరికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. మధ్యప్రదేశ్ మహా దర్శన్ పేరుతో అద్యాత్మిక పర్యటన 3 రాత్రులు, 4 రోజులపాటు కొనసాగనుంది.
Read also: Jithender Reddy: సంచలనంగా మారిన మాజీ ఎంపీ ట్వీట్.. టి.బీజేపీకి ఇలాంటి ట్రీట్‌మెంట్ అవసరం..!
Also Read
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
- Smit Machchhar: భారత హీరో పైలట్‌కు గుజరాత్ అత్యున్నత పురస్కారం..
- Divya Mittal: దివ్యా మిట్టల్ కోసం కాంగ్రెస్, ఎస్పీ పోటీ? యూపీలో మాజీ IAS సంచలనం..
అధ్యాత్మిక పర్యటనలో భాగంగా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని, ఓంకారేశ్వర్, మహేశ్వర్, ఇండోర్ వెళ్లే పర్యాటకుల కోసం ఐఆర్‌సీటీసీ సరికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. మధ్యప్రదేశ్ మహా దర్శన్ పేరుతో టూర్ ప్యాకేజీ అందిస్తోంది. అయితే ఈ అధ్యాత్మిక పర్యటనను విమాన మార్గంలో కొనసాగనుంది. మధ్యప్రదేశ్ మహా దర్శన్ పేరుతో ఐఆర్‌సీటీసీ ఈ టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ప్రస్తుతం ఈ టూర్ ఆగస్ట్ 3వ తేది నుంచి ప్రారంభం అవుతుంది. ఈ టూర్ ప్యాకేజీలో ఉజ్జయిని, ఓంకారేశ్వర్, మహేశ్వర్ లాంటి అధ్యాత్మిక ప్రాంతాలు సందర్శిస్తారు. హైదరాబాద్ నుంచి టూర్ ప్రారంభం అవుతుండగా.. 3 రాత్రులు, 4 రోజులు టూర్ కొనసాగుతుంది. మహా దర్శన్ టూర్ ప్యాకేజీ ధర సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.28,000, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.22,200, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.21,300, చెల్లించాల్సి ఉంటుంది. టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, హోటల్‌లో బస, 4 బ్రేక్‌ఫాస్ట్, 3 డిన్నర్, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయని ఐఆర్‌సీటీసీ ప్రకటించింది.
Read also: Paris Violence: ట్రాఫిక్ రూల్స్ పాటించలేదని యువకుడిని కాల్చి చంపిన పోలీసులు
మొదటి రోజు హైదరాబాద్ లో టూర్ ప్రారంభం అవుతుంది. ఉదయం 5.30 గంటలకు హైదరాబాద్ ఎయిర్ పోర్టు లో ఫ్లైట్ ఎక్కితే ఉదయం 7.45 గంటలకు ఇండోర్ చేరుకుంటారు. హోటల్ చెకిన్ అనంతరం ఉజ్జయిని బయలుదేరాలి. అక్కడ స్థానిక ఆలయాలైన హరసిద్ధి మాత ఆలయం, సాందీపని ఆశ్రమం, కాల భైరవ ఆలయం, మంగళనాథ్ ఆలయం, చింతామన్ గణేష్ ఆలయాలను సందర్శిస్తారు. అనంతరం రాత్రికి ఉజ్జయినిలో బస చేస్తారు. రెండో రోజు ఉదయం అల్పాహారం చేసి మహాకాళేశ్వర్ ఆలయ దర్శనం ( స్వంతంగా) ఉంటుంది. అనంతరం ఓంకారేశ్వర్‌కు బయలుదేరుతారు. రాత్రికి ఓంకారేశ్వర్‌లో బస ఉంటుంది. రెండో రోజు అల్పాహారం చేసి మధ్యాహ్నానికి హోటల్ నుంచి చెక్ అవుట్ ఉంటుంది. తర్వాత మహేశ్వర్ బయలుదేరుతారు. మహేశ్వర్ చేరుకున్న అనంతరం అహల్యదేవి ఫోర్ట్, నర్మదా ఘాట్ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత ఇండోర్ బయలుదేరాలి. రాత్రికి ఇండోర్‌లో బస ఉంటుంది. నాలుగో రోజు ఇండోర్‌లో అన్నపూర్ణ మందిర్, లాల్ భాగ్ ప్యాలెస్ సందర్శన ఉంటుంది.. ఆ తర్వాత తిరుగు ప్రయాణం. రాత్రి 7.20 గంటలకు ఇండోర్‌లో ఫ్లైట్ ఎక్కితే రాత్రి 8.40 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
తాజావార్తలు
-
Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
-
CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం’’.. సీజేపీ హెచ్చరిక!
-
Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
-
Global Horticulture Hub : రాయలసీమకు బిగ్ ప్రాజెక్ట్.. రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్
-
Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్‌కు బ్రేక్.. ఈసీఐ కీలక నిర్ణయం.!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?