పసిడి ప్రేమికులకు గుడ్‌న్యూస్.. మరోసారి బంగారం ధర తగ్గింది.. గత కొన్ని రోజులుగా పెరిగిన పుత్తడి ధరలు.. నిన్న మరియు ఇవాళ కిందకు దిగుతూ కాస్త ఊరట కలిగించింది.. హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 820 తగ్గడంతో.. రూ.47,840కు దిగివచ్చింది.
ఇక, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.750 తగ్గడంతో రూ. 43,850 కు క్షీణించింది. ఇవాళ బంగారం ధర తగ్గగా… మరోవైపు వెండి ధర కూడా భారీగా పడిపోయింది.. కేజీ వెండి ధర రూ.1500 తగ్గి రూ.70,200 వద్ద నమోదైంది. ఇక, అంతర్జాతీయ మార్కెట్‌లోనూ పసిడి ధర దిగివచ్చిందని నిపుణులు చెబుతున్నారు.