నెల్లూరులో కరోనా కలకలం సృష్టిస్తోంది. నలుగురికి కరోనా లక్షణాలు ఉన్నట్లు జీజీహెచ్ సిబ్బంది గుర్తించారు. అనుమానితుల నమూనాలను వ్యాధి నిర్ధారణ కోసం ల్యాబ్ కి పంపినట్లు వైద్యాధికారులు తెలిపారు. దీంతో చుట్టుపక్కల జనాలు భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు.. దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.. రోజరోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4 వేల 866 యాక్టివ్ కేసులు ఉన్నట్లు సమాచారం. గత 24 గంటల్లో ఒక వెయ్యి 238 కొత్త కేసులు నమోదైనట్లు వెల్లడించింది ఆరోగ్య…
ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం భారతదేశంతో సహా 20 కి పైగా దేశాలలో కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మళ్లీ ఈ వైరస్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? గత రెండు-మూడు సంవత్సరాల కంటే ఈసారి కోవిడ్ మరింత ప్రమాదకరంగా మారిందా? వైరస్‌లో ఏదైనా ప్రమాదకరమైన మ్యుటేషన్ జరిగిందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
పంజాబ్‌లో కరోనా వైరస్ కారణంగా ఓ వ్యక్తి మరణించాడు. చండీగఢ్ రాజధాని సెక్టార్ 32లోని ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రి (GMCH)లో ఈ రోజు ఉదయం 35 ఏళ్ల రోగి మృత్యువాత పడ్డాడు. కొన్ని రోజుల క్రితం ఈ రోగి పరిస్థితి విషమంగా ఉండటంతో లూథియానాలోని సమ్రాలా నుంచి చండీగఢ్‌కు రిఫర్ చేశారు. వైద్యుల అభిప్రాయం ప్రకారం.. రోగికి ఇప్పటికే కాలేయంలో గడ్డ ఉందని, ఇతర వ్యాధులతో (కొమొర్బిడ్ పరిస్థితులు) బాధపడ్డాడు. ఒకటి కంటే ఎక్కువ రోగాలు…
Corona : ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని బలిగొన్న కరోనా మహమ్మారి కారణంగా దేశంలో మరోసారి ఆందోళన మొదలైంది. దీనికి కారణంగా చాలా రాష్ట్రాల్లో కరోనా ఇన్‌ఫెక్షన్ కేసులు పెరగడం, ప్రజలు కూడా చనిపోతున్నారు.
ఒకవైపు కరోనా, మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాపకింద నీరులా వచ్చిపడుతున్నాయి. ఇప్పటికే 1700 కేసులు దాటిపోయి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది ఒమిక్రాన్ మహమ్మారి. తీవ్రత తక్కువగానే వున్నా జనం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా వుంటే.. దేశంలో వారం రోజుల్లో 5 రెట్లు పెరిగాయి కోవిడ్ కేసులు. గోవా వీధుల్లో బాగా బీచ్ సమీపంలో తీసిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అసలు కోవిడ్ వీరవిహారం చేస్తున్న వేళ వేలాదిమంది న్యూ ఇయర్ వేడుకల్లో…
ఇండియా కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరిగిపోతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం… గత 24 గంటల్లో కొత్తగా 6,984 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 247 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 34,710,628 కు చేరుకుంది. అలాగే మరణాల సంఖ్య 4,76,135 కు చేరుకుంది. ఇక, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 87,562 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది…
ఇండియా ఇవాళ కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 8,488 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది.. మరో 249 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు. ఇదే సమయంలో 12,510 మంది బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఇక ఇప్పటి వరకు 3,39,34,547 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. మరోవైపు యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. ప్రస్తుతం దేశ్యాప్తంగా…
ఇండియాలో కరోనా కేసులు మళ్ళీ భారీగా పెరిగాయి. 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 10,197 కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో 3,38,73,890 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,28,555 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 301 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో 4,64,153 మంది మృతి చెందినట్టు గణాంకాలు చెబుతున్నాయి. 24 గంటల్లో ఇండియాలో 12,134 మంది కరోనా నుంచి కోలుకోగా 50,71,135 మంది టీకాలు తీసుకున్నారు.…
మన దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా కరోనా బులిటెన్‌ను విడుదల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో ఇండియాలో 34,403 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,33,81,728 కి చేరింది. ఇందులో 3,25,98,424 మంది కోలుకొని డిశ్చార్జ్‌కాగా, 3,39,056 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక, గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 320 మంది మృతి…