ఢిల్లీలోని తీహార్ జైల్లో అసిస్టెంట్ సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న దీపక్ శర్మ ప్రవర్తన శృతిమించింది. ఓ బర్త్ డే పార్టీలో తుపాకీ పట్టుకుని హల్‌చల్ చేశాడు. సంజయ్ దత్ సినిమాలోని ‘ఖల్ నాయక్ హూన్ మైన్’ పాటకు డ్యాన్స్ చేస్తూ ఊగిపోయాడు. ఆయనతో పాటు మరికొందరు స్టెప్పులు వేస్తూ కనిపించారు. వారంతా మద్యం మత్తులో ఉన్నట్లు కనిపించారు. దీపక్ శర్మ కూడా మద్యం సేవించారో.. ఏమో తెలియదు గానీ ఊగిపోతు కనిపించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గురువారం ఘోండాకు చెందిన బీజేపీ కౌన్సిలర్ భర్త పుట్టినరోజు జరిగింది. పుట్టినరోజు వేడుకలకు వచ్చిన దీపక్ శర్మ సినిమాలోని పాటకు డ్యాన్స్ చేస్తూ ఊగిపోయారు. అంతేకాకుండా పిస్టల్‌ను చేత్తో పట్టుకుని డ్యాన్స్ చేశారు. ఆయనతో పాటు మరికొందరు డ్యాన్స్ చేశారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉండి.. ఇలాంటి ప్రవర్తనేంటి? అని ప్రశ్నించారు. అదే సామాన్యుడైతే ఈపాటికి అరెస్ట్ చేసేవారని నిలదీశారు. దీపక్ శర్మపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీపక్ శర్మపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని పోలీసులను డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే దీపక్ శర్మకు ఇన్‌స్టాగ్రామ్‌లో 4.4 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఫిట్‌నెస్‌పై ఆయనకు చాలా ఆసక్తి ఉంది. గతేడాది ఆగస్టులో రూ.50లక్షల మోసం కేసు బయటపెట్టినప్పుడు ఆయన వార్తల్లో నిలిచారు.
ఇదిలా ఉంటే ఈ మధ్య ఐఏఎస్, ఐపీఎస్‌లు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవల పూణె ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్.. తన ప్రవర్తనతో ఉద్యోగాన్ని పోగొట్టుకుంది. ఇక తెలంగాణలో మరో ఐఏఎస్ స్మితా సబర్వాల్.. దివ్యాంగులపై కామెంట్లు చేసి ప్రజల ఆగ్రహానికి గురైంది. తాజాగా తీహార్ జైలర్ దీపక్ శర్మ వివాదంలో ఇరుక్కున్నారు.
देखिए दिल्ली तिहाड़ जेल के जेलर दीपक शर्मा ने कल रात घोंडा से भाजपा की निगम पार्षद के पति की जन्मदिन पार्टी में डांस करते हुए पिस्टल लहराई,सीमापुरी थाने के पास चल रहा था आयोजन विडियो वायरल हुआ @DelhiPolice @Ravindra_IPS @HMOIndia @LtGovDelhi pic.twitter.com/NAiCXPTPDY
— Lavely Bakshi (@lavelybakshi) August 9, 2024
#bts #Trending #viral #encounter @TheJohnAbraham pic.twitter.com/H8mFOSncl3
— Deepak Sharma Jailor (@DeepakJailor) March 12, 2024