దేశంలో కరోనా పాజిటివ్ కేసులతో పాటు ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 3,007కి చేరింది. అత్యధికంగా మహారాష్ట్రలో 876 కేసులు, ఢిల్లీలో 465, కర్ణాటకలో 333, రాజస్థాన్లో 291, కేరళలో 284, గుజరాత్లో 204, తమిళనాడులో 121 కేసులు, హర్యానాలో 114 కేసులు, తెలంగాణలో 107 కేసులు, ఒడిశాలో 60 కేసులు, ఉత్తరప్రదేశ్లో 31 కేసులు, ఏపీలో 28 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. ఇప్పటివరకు 1,199 మంది ఒమిక్రాన్ నుంచి కోలుకున్నారు.
Read Also: కరోనా కల్లోలం.. భారత్లో లక్ష దాటేసిన రోజువారి కేసులు..
కాగా భారత్లో రానున్న రోజుల్లో డెల్టా వేవ్ తరహాలో ఒమిక్రాన్ కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతాయని ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవల్యూషన్ (ఐహెచ్ఎంఈ) డైరెక్టర్ ప్రకటించారు. జనవరి నెలాఖరు నుంచి ఫిబ్రవరి తొలివారంలోపు ఇప్పుడున్న వేవ్ తీవ్ర దశకు చేరుతుందన్నారు. ఒమిక్రాన్ వైరస్ లక్షణాలు స్వల్పంగానే ఉన్నా పెద్దసంఖ్యలో ప్రజలకు సోకుతుందన్నారు. ఎలాంటి నియంత్రణలు ఒమిక్రాన్ వ్యాప్తిని అడ్డుకోలేవని ఆయన అభిప్రాయపడ్డారు.
