కరోనా కల్లోలం.. భారత్‌లో లక్ష దాటేసిన రోజువారి కేసులు..

భారత్‌లో మళ్లీ కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది… గత నాలుగైదు రోజులుగా భారీ సంఖ్యలో రోజువారి కేసులు పెరుగుతూ వస్తున్నాయి.. ఇక, ఇవాళ ఏకంగా లక్ష మార్క్‌ను దాటేసి మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,17,100 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి, మరో 302 మంది కోవిడ్‌ బాధితులు ప్రాణాలు విడిచారు. దీంతో.. దేశంలో ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న కోవిడ్‌ కేసులు సంఖ్య 3,71,363కి పెరిగాయి.. అత్యధికంగా మహారాష్ట్రలోనే 36,265 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఇక, ఇదే సమయంలో 30,836 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.

తాజా కేసులతో కలుపుకుంటే డైలీ కేసుల పాజివిటీ రేటు 7.74 శాతానికి పెరిగింది.. యాక్టిక్‌ కేసులు 3,71,363గా ఉన్నాయి.. ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 3,43,73,845గా పెరగగా.. దేశవ్యాప్తంగా కోవిడ్‌ బారినపడి మృతిచెందినవారి సంఖ్య 4,83,178కు పెరిగింది.. మరోవైపు 23 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో కలిపి నమోదైన ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసుల సంఖ్య 2,630కు చేరింది.. ఇక, దేశవ్యాప్తంగా 149.66 కోట్ల కోవిడ్‌ డోసులు పంపిణీ చేసినట్టు కేంద్రం పేర్కొంది.

Read Also: ప్రత్యేక బస్సుల్లో ఏంటి ఈ దోపిడి..?

Related Articles

Latest Articles