Yogi Adityanath: ఈ ఎన్నికలు రామ భక్తులకు, రామ ద్రోహులకు మధ్య జరుగుతోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. గోహత్యను ప్రోత్సహించడం, ముస్లిం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా మత ప్రాతిపదికన దేశ విభజన కోసం నిలబడన కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాన్ని ‘‘రామద్రోహులు’’గా యోగి అభివర్ణించారు. బీహార్ బెగుసరాయ్ లోక్‌సభ స్థానంలో కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ తరుపున ఎన్నికల ప్రచారాన్ని శనివారం నిర్వహించారు. ఈ ఎన్నికలు రామ భక్తులకు, రామద్రోహులకు మధ్య జరుగుతున్నాయని అన్నారు.
Also Read
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
నేను రాముడి రాష్ట్రం నుంచి వచ్చాను, సీతా దేవి జన్మస్థలమైన బీహార్ ప్రజల హృదయాలతో అయోధ్య ఆలయానికి ప్రత్యేక స్థానం ఉందని తెలుసు అని యోగి అన్నారు. రామద్రోహులు రామ భక్తులపై తూటాలను పేల్చారు, మాఫియా డాన్ మరణానికి సంతాపం తెలిపారని పరోక్షంగా సమాజ్‌వాదీ పార్టీని దుయ్యబట్టారు. 1980వ దశకంలో ఎస్పీ వ్యవస్థాపకుడు దివంగత ములాయం సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ‘కరసేవకుల’పై పోలీసులు కాల్పులు జరపడం గురించి యోగి ప్రస్తావించారు. ఎన్డీయే అధికారం చేపట్టకముందే బీహార్‌లో ఆర్జేడీ-కాంగ్రెస్ అధర్మానికి కారణమని యోగి నిందించారు. ‘‘ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచనలకు ద్రోహం చేస్తూ ముస్లిం రిజర్వేషన్లను కల్పించడం ద్వారా దేశాన్ని మతప్రాతిపదికన విభజించడానికి వారు ప్రణాళికను రూపొందించారు’’ అని ఆరోపించారు. దళితులు, ఓబీసీలకు కేటాయించాల్సిన కోటాను ముస్లింలకు కేటాయిస్తు్న్నారంటూ కాంగ్రెస్‌ని నిందించారు.
గోహత్యలను ప్రోత్సహించే వారిని మనం వ్యతిరేకించాలని అన్నారు. ఎన్డీయేకు ఓటేసి ప్రధాని నరేంద్రమోడీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలని ప్రజల్ని కోరారు. మోడీ హయాంలో సరిహద్దుల్లో ఉగ్రవాదం తుడిచిపెట్టుకుపోయిందని, భారత్ గడ్డపై క్రాకర్స్ పేలినా, పాకిస్తాన్ సంజాయిషీ ఇచ్చుకునే పరిస్థితికి వచ్చిందని అన్నారు. భారతదేశం డిజిటల్ యుగంలోకి ప్రవేశిస్తే, ఆర్జేడీ, కాంగ్రెస్‌లు కలిసి మళ్లీ లాంతర్ యుగానికి తీసుకెళ్లాలని చూస్తున్నాయని ఆరోపించారు. యూపీలో 80 స్థానాలు గెలుచుకునేలా చూస్తున్నానని, బీహార్ కూడా ఎన్డీయేకి మెజారిటీ సీట్లు కట్టబెట్టాలని యోగి ప్రజల్ని కోరారు.
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!