Maruti Suzuki Brezza Facelift: మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ లాంచ్.. కొత్త ఇంజన్, 5- స్టార్ సేఫ్టీ, ధర రూ. 7.39 లక్షల నుంచి స్టార్ట్..
- మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ భారత మార్కెట్లో విడుదల.
- ప్రారంభ ధర రూ.7.39 లక్షలు (ఎక్స్‌షోరూమ్).
- పెట్రోల్, టర్బో పెట్రోల్, CNG ఇంజిన్ ఆప్షన్లు.
- భారత్ NCAPలో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్.
- 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్, వెంటిలేటెడ్ సీట్లు, అండర్బాడీ CNG ట్యాంక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maruti Suzuki Brezza Facelift: కార్ లవర్స్ ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ శుక్రవారం భారత మార్కెట్లో లాంచ్ అయింది. స్టైలిష్ డిజైన్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్లో చాలా మార్పులు చేసింది. దీంతో పాటు 2026 బ్రెజ్జా గతంతో పోలిస్తే ఎక్కువ ఇంజన్ ఆప్షన్లను అందిస్తోంది. ఇది పెట్రోల్, టర్బో పెట్రోల్, CNG ఇంజన్ ఆప్షన్లతో వస్తోంది. మరోవైపు భారత్ NCAP (B-NCAP) నుండి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించింది. కొత్త బ్రెజ్జా అనేక వేరియంట్లలో లభ్యమవుతోంది. CNG ట్యాంకును కార్ అండర్ బాడీకి మార్చింది. దీంతో బూట్ స్పేస్ మరింత కలిసి వస్తుంది.
ఆకర్షణీయమైన ధర, కాంపాక్ట్ SUVలో గట్టి పోటీ..
బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ రాకతో భారత్‌లో అత్యధికంగా అమ్ముడయ్యే కాంపాక్ట్ SUV విభాగంలో భారీ పోటీ నెలకొంది. ఈ కారు హ్యుందార్ వెన్యూ. టాటా నెక్సాన్, స్కోడా కైలాక్, మహీంద్రా XUV3XO, కియా సోనెట్‌లో పోటీ పడబోతోంది. ఇక ధర విషయానికి వస్తే రూ. 7.39 లక్షల(ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో కార్‌ను రిలీజ్ చేసింది.
Also Read
- Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
- Honda Shine Sales: షైన్ బైక్‌కు జనం ఫిదా.. ఒకే నెలలో 1.80 లక్షలకుపైగా అమ్మకాలు
- Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
- Tata Aeris vs Hyundai Aura.. డిజైన్, ఫీచర్లు, సేఫ్టీ, ఇంజిన్‌తో పాటు ఫ్యామిలీకి ఏది బెస్ట్ ఛాయిస్..?

ఇంజన్ ఆప్షన్లు:
మారుతి సుజుకి బ్రెజ్జాకు ఎట్టకేలకు 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తోంది. ఈ ఇంజన్ 110 హెచ్‌పి, 170 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 103 హెచ్‌పి, 139 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. పాత బ్రెజ్జాలో ఈ ఇంజన్‌ను వాడారు. సీఎన్జీ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. అన్ని వేరియంట్లలో 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ స్టాండర్డ్‌గా లభిస్తుంది. 1.5 లీటర్ పెట్రోల్ వేరియంట్లో 6-స్పీడ్ ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ కూడా అందుబాటులో ఉంది.
కొత్త డిజైన్, ప్రీమియం ఇంటీరియర్:
ఎక్స్టీరియర్లో కొన్ని మార్పులు చేశారు. ముందు భాగంలో డార్క్ క్రోమ్ ఫినిషింగ్‌తో ప్యానెల్లను కలిపే హెడ్ ల్యాంప్లతో కూడిన కొత్త గ్రిల్ ఉంది. బంపర్ కూడా కొత్తగా డిజైన్ చేశారు. LED హెడ్‌ల్యాంప్స్, L-షేప్ DRLs ఆకర్షణగా నిలుస్తాయి. ఇంటీరియర్‌లో 10.1 అంగుళాల SmartPlay Pro+ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, బిల్ట్-ఇన్ నావిగేషన్, అలెక్సా సపోర్ట్, 64-కలర్ అంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎయిర్ ప్యూరిఫైయర్, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటి ప్రీమియం ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
తాజావార్తలు
-
Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
-
Suma : నా స్క్రిప్ట్ లోనే దాచిపెట్టి దొంగదెబ్బ తీశారు! రాజమౌళి మాటలతో యాంకర్ సుమ ఎమోషనల్
-
Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
-
IND Vs WI: బౌలర్లపై విరుచుకుపడిన రోహిత్ శర్మ, గిల్.. సెంచరీలతో వీరవిహారం.. ఒక్క మ్యాచ్‌లో 5 సెంచరీలు..
-
Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!