IMD Alert: 17 రాష్ట్రాలకు అతి భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ
- 17 రాష్ట్రాలకు అతి భారీ వర్ష సూచన
- రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా మేఘాలు కమ్ముకున్నాయి. జూన్ నెలలో అంతంత మాత్రంగా ఉన్న వర్షాలు జూలైలో మాత్రం దంచికొడుతున్నాయి. గుజరాత్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా కేంద్ర వాతావరణ శాఖ పలు రాష్ట్రాలకు అతి వర్ష సూచన చేసింది. ఢిల్లీ, యూపీ, బీహార్, గుజరాత్ సహా 17 రాష్ట్రాల్లో వర్ష హెచ్చరిక జారీ చేసింది. గుజరాత్లో భారీ వర్షాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. అనేక రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
రేపు 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వర్ష హెచ్చరిక జారీ చేసింది. గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయి. తూర్పు ఉత్తర ప్రదేశ్‌లో జూలై 26వ తేదీ వరకు చెదురుమదురుగా వర్షాలు కురనున్నాయి. జూలై 27 నుంచి 30వ తేదీ వరకు దాదాపు అన్ని ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో జూలై 27వ తేదీ వరకు చెదురుమదురుగా వర్షాలు కురవనున్నాయి. జూలై 28 నుంచి 30వ తేదీ వరకు దాదాపు అన్ని ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
రేపు బీహార్‌లోని చాలా ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. జూలై 25, 27 తేదీల మధ్య అక్కడక్కడ వర్షం పడే అవకాశం ఉంది. జూలై 27, 29 తేదీలలో రాష్ట్రంలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాశ్మీర్‌లోని అనేక ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. దీంతో చాలా నదులు, వాగులలో నీటిమట్టం పెరిగి, వరదల ముప్పు ఏర్పడింది. వాతావరణ శాఖ ప్రకారం.. శుక్రవారం సాయంత్రం నుంచి దక్షిణ కాశ్మీర్, పరిసర ప్రాంతాల్లో వాతావరణం క్రమంగా మెరుగుపడే అవకాశం ఉంది. జూలై 28 నుంచి 31వ తేదీ వరకు ఈ ప్రాంతంలో మరింత వర్షం కురుస్తుందని కూడా ఆ శాఖ అంచనా వేసింది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..