Jantar Mantar: కాక్రోచ్ వేదికపై కానిస్టేబుల్ రాజీనామా.. అసలు నిజం తెలిసి అంతా షాక్..
- సీజేపీ వేదికపై కానిస్టేబుల్ షేర్ సింగ్ రాజీనామా..
- గ్యాంగ్‌స్టర్‌తో లింక్ ఉన్నట్లుగా ఉత్తరాఖండ్ పోలీసులు ప్రకటన..
- 2025లోనే షేర్ సింగ్‌పై క్రిమినల్ కేసులు, శాఖాపరమైన విచారణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jantar Mantar: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిరసన వేదికపై నుంచి ఉత్తరాఖండ్‌కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ షేర్ సింగ్ తన ఉద్యోగానికి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. తన భుజానికి ఉన్న బ్యాడ్జీని తీసేసి, అభిజిత్ దీప్కేకు అప్పగించాడు. ఒక్కసారిగా అక్కడ ఉన్న నిరసనకారులు అతడిని పొగుడుతూ, చప్పట్లతో నినానాలు చేశారు. అయితే, ఈ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. షేర్ సింగ్ ఇప్పటికే సస్పెన్షన్‌లో ఉన్నాడని, అతడిపై క్రిమినల్ కేసులు, శాఖాపరమైన విచారణ కొనసాగుతోందని ఉత్తరాఖండ్ పోలీసులు వెల్లడించారు.
ఐజీ కుమావోన్ నివేదిక కుక్రేటి తెలిపిన వివరాల ప్రకారం.. షేర్ సింగ్ చాలా కాలంలో క్రియాశీలక పోలీస్ విధుల్లో లేరు. 2025లో ఓ క్రిమినల్ కేసులో అరెస్టైన తర్వాత అతడిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ప్రస్తుతం అతడిపై డిపార్ట్మెంట్ ఎంక్వైరీ నిర్వహిస్తోంది. షేర్ సింగ్‌కు హరిద్వార్-రూర్కీ ప్రాంతానికి చెందిన గ్యాంగ్‌స్టర్ ప్రవీణ్ వాల్మీకి ముఠాతో సంబంధాలు ఉన్నాయి. ప్రజల్ని బెదిరించి భూములను అక్రమంగా ఆక్రమించడం, నకిలీ పత్రాల ద్వారా ఆస్తుల్ని బదిలీ చేయడం వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్న ఈ ముఠాకు సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కానిస్టేబుల్‌గా ఉన్న షేర్ సింగ్, సితార్‌గంజ్ జైలులో మరియు రూర్కీ కోర్టులో గ్యాంగ్‌స్టర్ ప్రవీణ్ వాల్మీకిని పలుమార్లు కలవడం ద్వారా తన పదవిని దుర్వినియోగం చేశాడని పోలీసులు ఆరోపిస్తున్నారు.
Also Read
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ఒక వితంతువుకు చెందిన భూమిని కబ్జా చేసేందుకు నిందితులకు సహకరించినట్లు పోలీసులు ఆరోపించారు. కేసు విత్ డ్రా చేసుకోవాలని కుటుంబంపై ఒత్తిడి తీసుకురావడం, కోర్టులో బాధితురాలని బెదిరించే ప్రయత్నం చేయడం వంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ ఆరోపణలపై ఆధారాలు సేకరించిన తర్వాత 2025 సెప్టెంబర్ 15న షేర్ సింగ్‌ను జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. దీని తర్వాత నైనిటాల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అరెస్టు తర్వాత విధుల నుంచి సస్పెండ్ అయ్యారు.
తాజావార్తలు
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!