CM Revanth Reddy : హైదరాబాద్ ట్రాఫిక్కు బిగ్ ప్లాన్.. ప్రత్యేక బ్యూరో ఏర్పాటు!
- ట్రాఫిక్, రోడ్డు భద్రతకు కొత్త బ్యూరో
- సిగ్నల్-ఫ్రీ హైదరాబాద్ లక్ష్యంగా సీఎం ఆదేశాలు
- అండర్పాస్లు, ఎలివేటెడ్ కారిడార్లపై ఫోకస్
- ORRపై కఠిన పర్యవేక్షణకు ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రతా పర్యవేక్షణపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలో పెరుగుతున్న రద్దీని తట్టుకునేందుకు, ప్రమాదాలను అరికట్టేందుకు స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్లాలని సీఎం ఆదేశించారు. కేవలం నిబంధనలు అమలు చేయడం కంటే, వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడం (Traffic Regulation) పైనే అధికారులు ఎక్కువ దృష్టి సారించాలని స్పష్టం చేశారు.
ప్రత్యేక బ్యూరో ఏర్పాటుకు ఆదేశం
ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రత పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఒక ‘బ్యూరో’ను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. పూర్తి స్థాయి అధ్యయనంతో ఈ బ్యూరో యొక్క సంస్థాగత నిర్మాణాన్ని చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నగరంలో వాతావరణ మార్పులు, వివిధ వర్గాల పనివేళలు, రద్దీ సమయాలు (Peak Hours) మరియు స్థానిక సంస్కృతిని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఇకపై ప్రతి రెండు లేదా మూడు నెలలకోసారి ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలపై సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు.
Also Read
సిగ్నల్ ఫ్రీ వ్యవస్థ.. ఎలివేటెడ్ కారిడార్లు
నగరంలో సిగ్నల్స్ దగ్గర వాహనాలు నిలిచిపోకుండా నిరంతరం మూవ్మెంట్ ఉండేలా చూడాలని అధికారులకు సీఎం సూచించారు. సిగ్నల్ ఫ్రీ వ్యవస్థను తీసుకువచ్చేందుకు అవసరమైన కీలక ప్రాంతాల్లో అండర్ పాస్లు, ఎలివేటెడ్ కారిడార్లను నిర్మించాలని స్పష్టం చేశారు. భవిష్యత్తులో కొత్తగా ఏవైనా మౌలిక సదుపాయాలు (Infrastructure) ఏర్పాటు చేసే ముందు, అక్కడ ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అవసరమైన ముందస్తు అధ్యయనం ఖచ్చితంగా చేయాలని సీఎం ఆదేశించారు.
ఔటర్ రింగ్ రోడ్డుపై కఠిన పర్యవేక్షణ
ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పై ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఔటర్ పై వాహనదారులు ఎక్కడపడితే అక్కడ వాహనాలను నిలపకుండా నిరంతరం పర్యవేక్షణ (Patrolling) ఉండాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తూనే, ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?