Delhi: చాట్‌జీపీటీకి శుభవార్త.. ఏఎన్ఐ కంటెంట్ వినియోగంపై ఢిల్లీ హైకోర్టులో ఊరట
- చాట్‌జీపీటీకి ప్రపంచంలోనే తొలి శుభవార్త
- ఏఎన్ఐ కంటెంట్ వినియోగంపై ఢిల్లీ హైకోర్టులో ఊరట
- భారత్‌లో తొలి కీలక తీర్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చాట్‌జీపీటీకి ప్రపంచంలోనే తొలి శుభవార్త అందింది. ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐ (ANI) కాపీరైట్ కంటెంట్‌ను వినియోగించినందుకు ఓపెన్ఏఐ (OpenAI)పై దాఖలైన కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఏఎన్ఐ వార్తలను చాట్‌జీపీటీ శిక్షణ కోసం ఉపయోగించడం కాపీరైట్ ఉల్లంఘన కాదని కోర్టు స్పష్టం చేసింది. కృత్రిమ మేధ (AI) మోడళ్ల శిక్షణ కోసం కాపీరైట్ ఉన్న వార్తా కంటెంట్ వినియోగంపై భారతదేశంలో వెలువడిన తొలి కీలక న్యాయ తీర్పుగా ఇది నిలిచింది.
జస్టిస్ అమిత్ బన్సాల్ ధర్మాసనం ఈ కేసును విచారిస్తూ.. చాట్‌జీపీటీ ఏఎన్ఐ వార్తలను గుర్తుంచుకుని యథాతథంగా వినియోగదారులకు తిరిగి అందిస్తోందని ఏఎన్ఐ నిరూపించలేకపోయిందని పేర్కొంది. అందువల్ల ఓపెన్ఏఐపై కాపీరైట్ ఉల్లంఘన ఆరోపణలు నిలబడవని స్పష్టం చేసింది. ఏఎన్ఐ వార్తలను ఏఐ మోడళ్లకు శిక్షణ ఇచ్చేందుకు నిల్వ చేయడం కాపీరైట్ చట్టంలోని ‘ఫెయిర్ డీలింగ్’ మినహాయింపులో భాగంగా పరిగణించవచ్చని కోర్టు అభిప్రాయపడింది. పరిశోధన ప్రయోజనాల కోసం కంటెంట్‌ను వినియోగించడం చట్టబద్ధమేనని, అందువల్ల ఈ చర్య కాపీరైట్ ఉల్లంఘన కిందకు రాదని న్యాయస్థానం పేర్కొంది.
Also Read
- Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
- Essential Commodity Prices: వంటింట్లో మంటలు.. 42 వస్తువుల్లో 41 ధరలు పెరుగుదల..! నిత్యావసరాల తాజా లెక్కలివే
- L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
- Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
ఏఎన్ఐ ఆరోపణలేమిటి?
2024 నవంబర్‌లో ఏఎన్ఐ ఢిల్లీ హైకోర్టులో ఓపెన్ఏఐపై కాపీరైట్ దావా వేసింది. తమ అనుమతి లేకుండానే ప్రచురించిన వార్తా కథనాలను ఏఐ మోడళ్ల శిక్షణ కోసం ఉపయోగించిందని, అంతేకాకుండా చాట్‌జీపీటీ కొన్నిసార్లు తప్పుడు వార్తలను కూడా ఏఎన్ఐ పేరుతో ఆపాదించిందని ఆరోపించింది.
భారత్‌లో తొలి కీలక తీర్పు
కాపీరైట్ ఉన్న వార్తా కంటెంట్‌ను ఏఐ సంస్థలు లైసెన్స్ తీసుకోకుండా శిక్షణ కోసం ఉపయోగించవచ్చా లేదా అనే అంశంపై భారత న్యాయస్థానం ఇచ్చిన తొలి ముఖ్యమైన తీర్పు ఇదే. ఇదే అంశంపై ఓపెన్ఏఐపై అమెరికా, కెనడా కోర్టుల్లో కూడా పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
- Tags
- ani
- ChatGPT
- Delhi
- high court
- OpenAI
తాజావార్తలు
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!