Kerala Bomb Blast: “వారి బోధనలు జాతి వ్యతిరేకంగా ఉన్నాయి”.. అందుకే బాంబులు పెట్టా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala Bomb Blast: కేరళలోని కలమస్సేరిలో ‘యొహోవా విట్నెసెస్’ క్రైస్తవ సమూహం ప్రార్థనల సమయంలో వరసగా మూడు పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లతో దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈ చర్యలో ఏదైనా ఉగ్రవాద కోణం ఉందా..? అని ఇప్పటికే ఎన్ఐఏ విచారణ జరుపుతోంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఒకరు మరణించగా.. 45 మంది గాయపడ్డారు. నిమిషాల వ్యవధిలోనే మూడు పేలుళ్లు జరగాయని, పేలుళ్లలో ఐఈడీని టిఫిన్ బాక్సుల్లో అమర్చినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదిలా ఉంటే ఈ పేలుళ్లకు తానే బాధ్యుడిననని డోమినిక్ మార్టిన్ అనే 48 ఏళ్ల వ్యక్తి త్రిసూర్ లోని కొకద్ర పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. ప్రస్తుతం అతన్ని కేరళ పోలీసులు విచారిస్తున్నారు. విచారణ సమయమంలో తన వద్ద ఉన్న సాక్ష్యాలను కూడా అందించారని పోలీసులు వెల్లడించారు.
Also Read
- Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్‌చుక్ ఆవేదన
యొహోవా విట్నెసెస్ బోధనలను ‘విద్రోహపూరితమైనవి’ ఉన్నాయని అతను ఆరోపించాడు. కాబట్టే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మార్టిన్ సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను పంచుకున్నాడు. గత 16 ఏళ్లుగా తాను యొహోవా విట్నెసెస్ సమూహంలో సభ్యుడిగా ఉన్నానని, తాను యొహోవా విట్నెసెస్ బోధనలతో ఏకీభవించడం లేదని, వారి కార్యకలాపాలను నిలిపివేయాలనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. వారి ఆలోచనలు దేశానికి ప్రమాదకరమని, అవి యువకులను విషపూరితం చేస్తున్నాయని ఆయన అన్నారు.
Read Also: Nagam Janardhan Reddy: నాగర్ కర్నూల్ భవిష్యత్ కోసం బీఆర్ఎస్లో జాయిన్ అవుతున్నా..
సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారిన 6 నిమిషాల వీడియోలో తానే ఈ దాడికి బాధ్యత వహిస్తున్నానని, అక్కడ పేలుళ్లు జరిపింది తానే అని వెల్లడించారు. ఆరేళ్ల క్రితం ఆ సంస్థ తప్పుడు మార్గంలో వెళ్తుందని, వారి బోధనలు దేశానికి వ్యతిరేకంగా ఉన్నాయని నేను గ్రహించానని, వాటిని మార్చుకోవాలని పలుమార్లు కోరానని, అయినప్పటికీ వారు అందుకు సిద్దపడలేదని వీడియోలో తెలిపారు.
దేశంలో నివసిస్తున్న ఇక్కడి ప్రజలను వారు వ్యభిచారులు అని పిలిచే వారని, వారు ఇతరులతో భోజనం చేయవద్దని, వారితో ఉండొద్దని కోరుతారని, వారి భావజాలం తప్పని గ్రహించానని మార్టిన్ వెల్లడించారు. ఓటు వేయద్దని, సైన్యంలో చేరవద్దని చెప్పేవారిని ఆరోపించారు. ఇలాంటి ప్రమాదకరమైన ఆలోచనలను వ్యాప్తి చేసే ఈ రకమైన సంస్థను నియంత్రించకపోతే, నాలాంటి వారి జీవితాలను త్యాగం చేయాల్సి ఉంటుందని అన్నారు. వారు ఎవరికీ సాయం చేయరు, ఎవరిని గౌరవించరు, దేశానికి వారు ప్రమాదకరంగా ఉన్నారని ఆయన ఆరోపించారు.
#BREAKING: A person identified as Dominic Martin has claimed responsibility for the #KalamasseryBlasts and has surrendered before the Police. On his Facebook Live broadcast, Martin defended his act as a warning against the “anti-national” nature of Jehovah’s Witnesses, a… pic.twitter.com/FK9eyjKL1h
— Siddharth (@DearthOfSid) October 29, 2023
తాజావార్తలు
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్‌లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
-
Hero Pleasure Plus: మరింత స్టైలిష్‌గా హీరో ప్లెజర్ ప్లస్.. కొత్త Aqua Grey కలర్లో విడుదల!
-
YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
-
Preity Zinta: ‘సగం ఇండియన్, సగం అమెరికన్… పిల్లలకు ఇండియన్ రూట్స్… ఎనిమిదేళ్ల రీఎంట్రీపై ప్రీతి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!