Kerala Bomb Blast: కేరళలోని కలమస్సేరిలో ‘యెహోవా విట్‌నెస్’ క్రైస్తవ సమూహం ప్రార్థనల సమయంలో వరసగా మూడు పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లతో దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈ చర్యలో ఏదైనా ఉగ్రవాద కోణం ఉందా..? అని ఇప్పటికే ఎన్ఐఏ విచారణ జరుపుతోంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఒకరు మరణించగా.. 45 మంది గాయపడ్డారు. నిమిషాల వ్యవధిలోనే మూడు పేలుళ్లు జరగాయని, పేలుళ్లలో ఐఈడీని టిఫిన్ బాక్సుల్లో అమర్చినట్లు పోలీసులు వెల్లడించారు.