కేరళలోని వయనాడ్ జిల్లాలో నోరోవైరస్ కేసులను కేరళ ప్రభుత్వం గుర్తించింది. రెండు వారాల క్రితం వయనాడ్ జిల్లాలోని వైత్తిరి సమీ పంలోని పూకోడ్‌లోని వెటర్నరీ కళాశాలలో 13 మంది విద్యార్థు లకు అరుదైన నోరోవైరస్ ఇన్‌ఫెక్షన్ సోకిఇంది. ఈ వైరస్ సోకిన వారు వాంతులు,విరేచనాలకు గురయ్యే అవకాశం ఉందన్నారు. ఇది అంటువ్యాధి వైరస్ అని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేరళ ప్రభుత్వం హెచ్చరించింది.
ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి వచ్చినప్పటికీ, మరింత వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుం టున్నామని తెలిపారు. ఇప్పటికే పశువైద్య విజ్ఞాన కళాశాల విద్యార్థుల డేటా బ్యాంక్‌ను సిద్ధం చేస్తు న్నామని ఆరోగ్య అధికారులు తెలిపారు. వెటర్నరీ కళాశాల అధికారు లు మాట్లాడుతూ క్యాంపస్ వెలుపల హాస్టళ్లలో నివసిస్తున్న విద్యా ర్థులలో మొదట ఇన్ఫెక్షన్ సోకిన వారిని గుర్తిస్తున్నామని తెలి పారు. ఆరోగ్య అధికారులు త్వరగా నమూనాలను సేకరించి పరీక్షల కోసం అలప్పుజాలోని ఎన్‌ఐవికి పంపినట్టు వైద్యాధికారులు తెలిపారు.
దీనిపై రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ అధ్యక్షతన ఆరోగ్య అధికారుల సమావేశం నిర్వహించి వయనాడ్‌లో పరిస్థితిని సమీక్షించారు.వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు ముమ్మరం చేయాలని మంత్రి అధికా రులను ఆదేశించారు. ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే అందరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. సూపర్ క్లోరినేషన్ సహా నివారణ చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.తాగునీటి వనరులు పరిశుభ్రంగా ఉండాలని, సరైన నివారణ, చికిత్సతో, వ్యాధిని త్వరగా నయం చేయవచ్చని వైద్యాధికారులు మంత్రికి తెలిపారు.