బైసారన్ లోయలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఒక నేపాలీ జాతీయుడితో సహా ఇరవై ఆరు మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటనకు పాల్పడిన టెర్రరిస్టులను పట్టుకునేందుకు భారత భద్రతా దళాలు గాలింపు చర్యలు ప్రారంభించాయి. ఈ ఘోరమైన కాల్పులకు పాల్పిన ఉగ్రవాదులు పాకిస్తాన్‌లో ఉన్నత సైనిక శిక్షణ పొందారని నిఘా వర్గాలు తెలిపాయి.