తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జాతీయ విద్యా విధానానికి స్వస్తి పలికి రాష్ట్ర విద్యా విధానాన్ని ప్రకటించారు.
దక్షిణాది రాష్ట్రాలను బీజేపీ ఎప్పుడూ అణిచివేస్తోందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ ఆరోపించారు. స్టాలిన్ నేతృత్వంలో డీలిమిటేషన్‌పై చెన్నైలోని ఐటీసీ ఛోళా హోటల్‌లో దక్షిణాది రాష్ట్రాల సీఎంలు సమావేశం అయ్యారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు వాటిల్లే నష్టంపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు
తమిళంపై కేంద్రానికి ప్రేముంటే.. తమిళనాడులోని కేంద్ర కార్యాలయాల్లో హిందీ తొలగించాలని ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్‌లో డిమాండ్ చేశారు. డీలిమిటేషన్‌పై స్టాలిన్.. బుధవారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆయా రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ భేటీలో కమల్‌హాసన్ కూడా పాల్గొన్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో పార్లమెంట్ స్థానాలు పెరగాలంటే.. పెళ్లైన జంటలు త్వరత్వరగా పిల్లల్ని కనాలని స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. త్వరలో కేంద్రం.. డీలిమిటేషన్ చేయబోతుంది. జనాభా ప్రాతిపదికన లోక్‌సభ స్థానాలు పెరుగుతాయని సూచించింది. అయితే కేంద్ర ప్రకటనపై స్టాలిన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్రంలో ప్రధాని మోడీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశం 200 ఏళ్లు వెనక్కి పోతుందన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా డీఎంకే అభ్యర్థి టీఆర్ బాలుకు సపోర్టుగా శ్రీపెరంబుదూర్‌లో జరిగిన ర్యాలీలో సీఎం పాల్గొన్నారు.
డీఎంకే మాజీ కార్యకర్త జాఫర్ సాదిక్ ఇటీవల అరెస్టయిన అంతర్జాతీయ డ్రగ్ కార్టెల్‌తో తనకు సంబంధం ఉందన్న ఆరోపణలపై అన్నాడీఎంకేకు చెందిన ఎడప్పాడి కరుప్ప పళనిస్వామి (ఈపీఎస్), రాష్ట్ర బీజేపీ చీఫ్ కె.అన్నామలైపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గురువారం పరువు నష్టం దావా వేశారు.
మహిళలకు తమిళనాడు సర్కారు శుభవార్త చెప్పింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈరోజు మహిళలకు నెలవారీ రూ.1,000 సహాయం అందించడానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించారు.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నళినీ శ్రీహరన్ సహా ఆరుగురు దోషులను విడుదల చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శుక్రవారం స్వాగతించారు.