Tamil actor Vijay: తమిళనాడులో 10, 12 తరగతుల్లో బోర్డు పరీక్షల్లో టాప్ ర్యాంక్‌లు సాధించిన విద్యార్థులను తమిళ సినీ హిరో విజయ్ సత్కరించారు. శనివారం చెన్నైలో జరిగిన కార్యక్రమంలో బోర్డు పరీక్షల్లో మొదటి మూడు ర్యాంకులు సాధించిన వారిని విజయ్ సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎక్కువగా చదవాలని.. చదివిన దాంట్లో మంచిని మాత్రమే తీసుకోవాలని సూచించారు. జాతీయ నాయకుల గురించి ఎక్కువగా తెలుసుకోవాలన్నారు. భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్, పెరియార్, కామరాజ్ వంటి జాతీయ నాయకుల గురించి విద్యార్థులు విస్తృతంగా చదవాలని సూచించారు.
Read also: Nikki Tamboli: కుర్రాళ్లకు అందాల గాలం వేస్తున్నావా పాప
బోర్డు పరీక్షల్లో టాప్ మూడు ర్యాంకర్లను సత్కరించిన తరువాత హిరో విజయ్ మాట్లాడుతూ సాధ్యమైనంత వరకు ప్రతిదాని గురించి చదవండి.. అంబేద్కర్, పెరియార్, కామరాజ్ వంటి నాయకుల గురించి చదవండి… ఏది మంచిదో తీసుకోండి, మిగిలినవి వదిలేయండని సూచించారు. విద్యార్థులు ఒకరికొకరు సహకారం అందించుకోవాలన్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన స్నేహితులకు, వారితో మాట్లాడి.. వారికి మద్దతు తెలుపుతూ ధైర్యం ఇవ్వమని కోరారు. మీకు కావలసిన పనులు చేయకుండా మిమ్మల్ని నిరుత్సాహపరిచే వారు ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటారని.. అయితే నీలోని అంతరంగాన్ని వినాలని సూచించారు. తన ప్రయాణం గురించి చెబుతూ.. తన కల సినిమా అని ఆ బాటలోనే తన ప్రయాణం సాగిందన్నారు. ఇటీవల తనకు నచ్చిన ఒక డైలాగ్ లో మీ నుండి అన్ని దొంగిలించబడతాయి.. కానీ మీ విద్యను ఎవరు దొంగించలేరని అందులో ఉందన్నారు. అది తనను కదిలించాయని.. ఇది వాస్తవికత అన్నారు. అప్పటి నుంచే తనకు విద్యారంగంలో ఏదైనా చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నాను. దానికి ఇదే మంచి సమయంగా భావించి తాను ఈ కార్యక్రమాన్ని చేయాలనుకున్నట్టు చెప్పారు. ప్రపంచ ఆకలి దినోత్సవం రోజున మొత్తం 234 నియోజకవర్గాలలో పేదలు మరియు నిరుపేదలకు ఉచిత ఆహారాన్ని పంపిణీ చేయాలని విజయ్ తన అభిమానుల క్లబ్‌ను ఆదేశించారు.
Read also: ODI World Cup 2023: భారత్ గడ్డపై మెగా టోర్నీ.. ప్రపంచ్‌కప్ 2023 నుంచి పాకిస్తాన్ ఔట్?
విజయ్ త్వరలో రాజకీయ ప్రవేశం చేయాలని యోచిస్తున్నట్లు ఆయనకు సన్నిహిత వర్గాలు సూచించిన సమయంలో విద్యార్థులను సత్కరించే చర్య అతని రాజకీయ అరంగేట్రం గురించిన ఊహాగానాలకు ఊతమిచ్చినట్టు అవుతంది. ఇదే సమయంలో విజయ్ అభిమానుల సంఘం, ఆల్ ఇండియా తలపతి విజయ్ మక్కల్ ఇయక్కం మొత్తం 234లో బూత్ కమిటీలను ఏర్పాటు చేసే పనిలో పడినట్టు తెలిసింది. ఒక ప్రణాళికను రూపొందించడానికి అతని అభిమానులు రాజకీయ వ్యూహకర్తలతోపాటు ఇతర నిపుణులతో కూడా టచ్‌లో ఉన్నట్టు వారు చెబుతున్నారు. గతంలో విజయ్ రాజకీయ అంశాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. అతను జల్లికట్టు నిరసనలో పాల్గొన్నారు. సాధారణ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంలో విఫలమై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అరియలూర్‌కు చెందిన నీట్ ఆశాకిరణం అనిత ఇంటిని సందర్శించారు.. స్టెరిలైట్ వ్యతిరేక నిరసన సందర్భంగా పోలీసుల కాల్పుల్లో మరణించిన వారి నివాసాలను సైతం గతంలో ఆయన సందర్శించారు.