Swati Maliwal : ఆప్ నేత, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలోనే దాడి జరగడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కేజ్రీవాల్‌కి అత్యంత సన్నిహితుడు, పీఏ అయిన బిభవ్ కుమార్ ఆమెపై దాడి చేసినట్లు ఆరోపించారు. ఈ కేసును ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆమె ఆదివారం సంచలన ఆరోపణలు చేశారు. ప్రముఖ యూట్యూబర్ ధృవ్ ఠాథీపై విమర్శలు గుప్పించారు.
యూట్యూబర్ ధృవ్ రాథీ తన క్యారెక్టర్‌ని దెబ్బతీసే విధంగా ఏకపక్షంగా వీడియోలు పోస్టు చేశారని ఆమె ఆరోపించారు. సోషల్ మీడియాలో తనకు అత్యాచారం, హత్య బెదిరింపులు వస్తున్నాయని పేర్కొంది. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను కూడా ఆమె ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ‘‘ నా పార్టీకి చెందిన నాయకులు, వాలంటీర్లు అంటే ఆప్ నాపై హత్యాయత్నం, బాధితులను అవమానించడం, నాపై భావోద్వేగాలు రెచ్చగొట్టడం వంటి ప్రచారాన్ని నిర్వహించిన తర్వాత, నాకు రేప్, హత్య బెదిరింపులు వస్తున్నాయి. యూట్యూబర్ ధృవ్ రాథీ ఏకపక్ష వీడియోలు పోస్ట్ చేసిన తర్వాత ఇది మరింత తీవ్రమైంది. ’’ అని ఆమె ట్వీట్ చేశారు.
Read Also: Karimnagar: ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు.. మిరియాల పేరుతో పుప్పొడి విత్తనాలు
పార్టీకి వ్యతిరేకంగా ఆమె చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని ఆప్ నాయకత్వం తనపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని మలివాల్ పేర్కొన్నారు. అయితే, తనపై దాడి ఘటనను ధృవ్ రాథీలో పంచుకోవడానికి తాను చాలా సార్లు ప్రయత్నించానని, ఆయన నుంచి సమాధానం రాలేదని ఆమె చెప్పారు. ఆమె యూట్యూబర్ ధృవ్ రాథీని ఆప్ ప్రతినిధిగా ట్యాగ్ చేశారు. అతను బాధితురాలైన తనను అవమానించాడని స్వాతి మలివాల్ ఆరోపించారు. రాథీ తన 2.5 నిమిషాల వీడియోలో కొన్ని వాస్తవాలను పేర్కొనడంలో విఫలమైనట్లు చెప్పారు.
వారు తన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని నన్ను భయపెడుతున్నారని ఆప్‌పై ఆరోపణలు గుప్పించారు. తాను ధృవ్ రాథీని సంప్రదించడానికి నా వంతు ప్రయత్నం చేశానని, కానీ అతను తన కాల్స్‌ని పట్టించుకోలేదని సమాధానం ఇవ్వలేదని పోస్టులో పేర్కొన్నారు. ఇండిపెండెంట్ జర్నలిస్టులు అని చెప్పుకునే అతని లాంటి వ్యక్తులు ఇతర ఆప్ అధికార ప్రతినిధుల్లా ప్రవర్తించడం సిగ్గు చేటని, బాధితురాలినైన తనను బెదిరింపులకు, తీవ్ర దుర్భాషలకు గురిచేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు. అత్యాచారం మరియు హత్య బెదిరింపులను తాను ఢిల్లీ పోలీసులకు నివేదిస్తున్నానని, అధికారులు నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు ఆమె పేర్కొంది.
After the leaders and volunteers of my party i.e. AAP orchestrated a campaign of charachter assassination, victim shaming and fanning of emotions against me, I have been getting rape and death threats.
This got further exacerbated when YouTuber @Dhruv_Rathee posted a one-sided… pic.twitter.com/EfCHHWW0xu
— Swati Maliwal (@SwatiJaiHind) May 26, 2024