Dhruv Rathee: ఎన్నికల ముందు బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చాలా ఫేమస్ అయిన ప్రముఖ యూట్యూబర్ ధృవ్ రాఠీ వరస వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. తాజాగా ముంబైకి చెందిన బీజేపీ నేత సురేష్ కరంషీ నఖువా అతనిపై పరువు నష్టం కేసు వేశారు.
Dhruv Rathee: ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాథీపై మహారాష్ట్ర పోలీసులు కేసు బుక్ చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తెపై ఎక్స్‌లో నకిలీ వార్తల్ని పేరడీ అకౌంట్‌లో పోస్ట్ చేశాడనే ఆరోపణలపై మహరాష్ట్ర సైబర్ క్రైమ్ విభాగం కేసు నమోదు చేసినట్లు సీనియర్ అధికారులు శనివారం తెలిపారు.
Dhruv Rathee: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయన పీఏ బిభవ్ కుమార్, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి చేయడం సంచలనంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ పోలీసులు బిభవ్‌ని అరెస్ట్ చేశారు.
Swati Maliwal : ఆప్ నేత, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలోనే దాడి జరగడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కేజ్రీవాల్‌కి అత్యంత సన్నిహితుడు, పీఏ అయిన బిభవ్ కుమార్ ఆమెపై దాడి చేసినట్లు ఆరోపించారు.