Supreme Court : ఆపరేషన్ సింధూర్ వివరాలను మీడియాకు తెలియజేసిన ఆర్మీ ఆఫీసర్ కల్నల్ సోఫియా ఖురేషీతో పాటు భారత సైన్యంపై మధ్యప్రదేశ్ రాష్ట్ర గిరిజన వ్యవహారాల మంత్రి విజయ్ షా ఇటీవల చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో అతడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ.. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇవాళ విచారించనుంది. ఈ పిల్ ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్‌కే సింగ్‌లతో కూడిన డివిజన్ బెంచ్ విచారించనుంది.
Read Also: Keerthi Suresh : చీరకట్టులో కీర్తి సురేష్.. ఘాటు పెంచేసిందిగా..
అయితే, శుక్రవారం సమయాభావం కారణంగా జస్టిస్ కాంత్ నేతృత్వంలోని ధర్మాసనం మంత్రి విజయ్ షా స్పెషల్ లీవ్ పిటిషన్ ని విచారించలేక పోయింది. పిటిషనర్ అభ్యర్థన మేరకు ఈ పిటిషన్ ను నేటి జాబితాలో చేర్చాలని ఆదేశించింది. మరోవైపు, విజయ్ షా తరపు న్యాయవాది సుప్రీంకోర్టులో SLPని అత్యవసరంగా విచారించాలని కోరినప్పుడు.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం మంత్రి తీరుపై తీవ్రంగా మండిపడింది. స్పెషల్ లీవ్ పిటిషన్ జాబితా గురించి మధ్యప్రదేశ్ హైకోర్టుకు తెలియజేయాలని సీనియర్ న్యాయవాదికి చీఫ్ జస్టిస్ సూచించారు. కల్నల్ సోఫియా ఖురేషీని ఉగ్రవాదుల సోదరి అని పేర్కొనడం ముస్లిం సమాజం మనోభావాలను దెబ్బ తీయడం నేరమని జస్టిస్ శ్రీధరన్ ధర్మాసనం పేర్కొనింది.