కల్నల్ సోఫియా ఖురేషిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి కున్వర్ విజయ్ షాపై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి క్షమాపణలను అంగీకరించలేమని చెప్పింది. ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలని తెలియదా? అని ఫైర్ అయింది.
మధ్యప్రదేశ్ రాష్ట్ర గిరిజన వ్యవహారాల మంత్రి విజయ్ షా ఇటీవల చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో అతడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ.. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇవాళ విచారించనుంది.
మధ్యప్రదేశ్ మంత్రి కున్వర్ విజయ్ షాకు హైకోర్టు మరో షాకిచ్చింది. మంత్రిపై నమోదైన కేసును కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయాలని హైకోర్టు ఆదేశించింది. బుధవారం మంత్రిపై కేసు నమోదు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.