Madhya Pradesh Minister: కల్నల్ సోఫియా ఖురేషిపై మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి విజయ్ షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అతడి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ పరిణామాలతో ఆయన పదవీగండం ఎదుర్కుంటున్నట్లు సమాచారం.
మధ్యప్రదేశ్ రాష్ట్ర గిరిజన వ్యవహారాల మంత్రి విజయ్ షా ఇటీవల చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో అతడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ.. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇవాళ విచారించనుంది.
ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషిపై నోరు జారిన మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ మంత్రి కున్వర్ విజయ్ షాపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుచిత వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలని పోలీసులకు న్యాయస్థానం ఆదేశించింది.