నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించిన హిట్: ది ఫస్ట్ కేస్, హిట్ 2 : ది సెకండ్ కేస్ సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాల్లో హిట్ ఫస్ట్ కేస్‌లో విశ్వక్ సేన్ హీరోగా నటించగా సెకండ్ కేస్‌లో అడివి శేష్ హీరోగా నటించాడు. ఇక ఇప్పుడు ఈ సక్సెస్ ఫుల్ ఫ్రాంచైజ్ లో భాగంగా వస్తున్న హిట్ 3లో స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్నాడు నాని .
Also Read : Catherine : వరుస ఛాన్స్ లు కొట్టేస్తున్న ఎమ్మెల్యే.. హిట్ కొట్టేనా..?
ఆ మధ్య రిలీజ్ చేసిన హిట్ 3 ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన హిట్ 3 ట్రైలర్ అందరిని ఆశ్చర్యపరించింది. నేచురల్ స్టార్ కాస్త మోస్ట్ వైలెంట్ స్టార్ గా మారాడనే కామెంట్స్ వినిపించాయి. ప్రస్తుతం షూటిగ్ చివరిదశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో నాని తో పాటి మరొక స్టార్ హీరో కూడా నటిస్తున్నాడట. కోలీవుడ్ స్టార్ హీరో అయిన కార్తీకి టాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంది. ఈ స్టార్ హీరో సినిమాలు తమిళ్ తో పాటు తెలుగులోను మంచి కలెక్షన్స్ రాబడతాయి. కాగా సర్దార్, వా వాతియార్ వంటి సినిమాలో పోలీస్ రోల్ లో అదరగొట్టిన కార్తీ ఇప్పుడు హిట్ 3 లో ఓ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం. త్వరాలోనే అందుకు సంబంధించి త్వరలోనే అధికారకే ప్రకటన రానుంది. భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా మే 9 న రిలీజ్.కానుంది