జస్టిస్ యశ్వంత్ వర్మకు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. త్రిసభ్య కమిటీ దర్యాప్తు నివేదికను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌ను కొట్టేసింది. అంతర్గత విచారణ కోసం ముగ్గురు హైకోర్టు జడ్జిలతో గతంలో కమిటీ వేసింది.
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో భారీగా నగదు దొరకడంపై దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ పరిణామంపై సుప్రీం ధర్మాసనం కూడా చాలా సీరియస్ అయింది. తాజాగా సర్వోన్నత న్యాయస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది.