2020 ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఫిబ్రవరి 2020 అల్లర్ల కేసులో బెయిల్ నిరాకరిస్తూ సెప్టెంబర్ 2న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
బాలీవుడ్ నటులపై మత సంబంధమైన వ్యాఖ్యలు చేయడంతో పుణెకు చెందిన లా విద్యార్థిని శర్మిష్ట పనోలిని పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురుగ్రామ్‌లో పనోలిని అరెస్ట్ చేసి కోల్‌కతాకు తరలించారు. అక్కడ స్థానిక కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించింది. దీంతో ఆమెను జైలుకు తరలించారు.
మత మార్పిడి నిందితులకు బెయిల్ మంజూరు చేసేందుకు కర్ణాటక హైకోర్టు నిరాకరించింది. వివాహిత షెడ్యూల్డ్ కులానికి చెందిన మహిళను బందీగా తీసుకెళ్లి అత్యాచారం చేశాడని.. బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చారని ఫిర్యాదుపై నిందితుడిపై కేసు నమోదైంది.