SpiceJet Flight Makes Emergency Landing In Delhi After Fire Light Illuminates: విమానంలో ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు.. కాక్‌పిట్‌లో ఉండే ఒక వార్నింగ్ లైట్ మోగుతుంది. అప్పుడు కెప్టెన్ వెంటనే అప్రమత్తమై.. ప్రమాదం పెద్దది అవ్వకుండా ఉండేందుకు, వెంటనే ఎమెర్జెన్సీ ల్యాండింగ్ చేస్తాడు. తాజాగా ఓ కెప్టెన్ కూడా అదే పని చేశాడు. వార్నింగ్ లైట్ మోగడంతో.. మరో క్షణం ఆలోచించకుండా వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. తీరా చూస్తే.. టెక్నికల్ సమస్యల కారణంగా ఆ వార్నింగ్ లైట్ మోగిందని తెలిసి, అధికారులు షాక్‌కు గురయ్యారు. ఈ విచిత్ర ఘటన ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకెళ్తే..
Abdul Samad: అబ్దుల్.. వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకోపో.. నెట్టింట్లో ట్రోలింగ్
140 ప్రయాణికులతో కూడిన ఒక స్పైస్‌జెట్ విమానం.. మంగళవారం ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు బయలుదేరింది. అది గాల్లోకి ఎగిరిన కాసేపటికే.. ఒక వార్నింగ్ బెల్ మోగింది. కార్గోలో నిప్పంటుకున్నప్పుడు ఆ బెల్ మోగుతుంది. కెప్టెన్ కూడా అదే అనుకున్నాడు. ఉన్నట్టుండి వార్నింగ్ బెల్ మోగడంతో.. కార్గోలో ఏదైనా నిప్పు అంటుకుందేమోనని భావించాడు. దీంతో.. అతడు వెంటనే విమానాన్ని వెనక్కు తిప్పి, ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. ల్యాండ్ అయిన వెంటనే అధికారులు లోపల ఎలాంటి ప్రమాదం జరిగిందోనని పరిశీలించేందుకు వెళ్లారు. కొద్దిసేపు పరిశీలించిన అనంతరం.. అధికారులకు అసలు విషయం తెలిసిందే! కార్గోలో ఎలాంటి పొగ, మంటలు వచ్చిన సంకేతాలు రాలేదని తేల్చిన ఆ అధికారులు.. టెక్నికల్ సమస్యల కారణంగా ఆ వార్నింగ్ బెల్ మోగిందని స్పష్టం చేశారు.
Vizag Capital: రాజధానిపై సీఎం కీలక ప్రకటన.. సెప్టెంబర్ నుంచి విశాఖలోనే కాపురం..
ఈ ఘటనపై ఓ స్పెస్‌జెట్ ప్రతినిధి మాట్లాడుతూ.. “ఏప్రిల్ 18న స్పైస్‌జెట్ B737 ఎయిర్‌క్రాఫ్ట్ ఆపరేటింగ్ ఫ్లైట్ SG-8373 ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు బయలుదేరగా.. గాల్లో ఉన్నప్పుడు కాక్‌పిట్‌లో కార్గో ఫైర్ లైట్ వెలిగింది. దీంతో.. ఆ విమానం ఢిల్లీకి తిరిగొచ్చింది. ప్రయాణికుల్ని సురక్షితంగా విమానంలో నుంచి దింపిన తర్వాత.. కార్గోని తెరిచి పరిశీలించాం. అయితే.. కార్గోలు ఎలాంటి మంటలు గానీ, పొగ సంకేతాలు గానీ కనబడలేదు. అప్పుడు టెక్నికల్ సమస్య వల్ల ఈ బెల్ మోగి ఉంటుందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చాం’’ అని తెలిపాడు. కాగా.. సాధారణ తనిఖీలను పూర్తి చేసిన అనంతరం, ఆ విమానం తిరుగు పయనమైనట్లు అధికారులు వెల్లడించారు.