ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా విమానం రద్దు కావడంతో.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.. గురువారం రోజు రేణిగుంట విమానాశ్రయంలో ప్రయాణికులు నిరసనకు దిగారు.. సమాచారం లేకుండా స్పైస్ జెట్ విమాన సర్వీస్ రద్దు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు..
Fight In Flight: విమానాల్లో ప్రయాణికుల వికృత చర్యలకు అడ్డుకట్టపడటం లేదు. ఇటీవల మూత్రవిసర్జన సంఘటన తర్వాత డీజీసీఏ ప్రయాణికుల ప్రవర్తనపై కీలక మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసింది. ఇదిలా ఉంటే తాజాగా సోమవారం ఢిల్లీ-హైదరాబాద్ స్పైస్ జెట్ విమానంలో ఓ ప్రయాణికుడు క్యాబిన్ సిబ్బందితో అమర్యాదగా ప్రవర్తించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. విమాన సిబ్బందిపై అనుచితంగా ప్రవర్తించిన ఇద్దరు ప్రయాణికులను విమానం నుంచి దించేశారు. ప్రయాణికుడిపై సెక్షన్ 354ఏ కింద…
Bomb threats to Spice Jet flight: ఢిల్లీ నుంచి పూణె వెళ్తున్న స్పైస్ జెట్ విమానానంలో బాంబు ఉందంటూ ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తం అయిన అధికారులు విమానాన్ని క్షణ్ణంగా సోదా చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సి ఉంది. అధికారుల సోదాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనుగొనబడలేదు. బాంబు బెదిరింపులతో ప్రయాణికుల బోర్డింగ్ ను ఆపి బాంబు స్క్వాడ్ విమానాన్ని తనిఖీ చేశారు.
స్పైస్ జెట్ విమానానికి ప్రమాదం తప్పింది. గాలిలో ఉండగా క్యాబిన్ లోకి పొగలు వ్యాపించడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు పైలెట్లు. ఢిల్లీ నుంచి మధ్య ప్రదేశ్ జబల్ పూర్ కు వెళ్తున్న స్పైస్ జెట్ విమానంలో అకాస్మత్తుగా పొగలు వచ్చాయి. క్యాబిన్ మొత్తం పొగతో నిండిపోయింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. పొగ కారణంగా ప్రయాణికులు ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. శనివారం ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరిన విమానం 5000 అడుగుల ఎత్తులోకి చేరుకోగానే…
Patna Spicejet Flight Emergency Landing: స్పైజ్ జెట్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఆదివారం బీహార్ రాజధాని పాట్నా నుంచి ఢిల్లీకి వెళ్లే క్రమంలో స్పైస్ జెట్ విమానం ఇంజిన్ లో సాంకేతిక సమస్య ఎదురైంది. విమానం టేకాఫ్ అయిన తర్వాత ఎడమ ఇంజిన్ ను పక్షి ఢీకొనడం వల్ల మంటలు చెలరేగాయి. దీంతో పైలెట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సమాచారం అందించి.. విమానాన్ని పాట్నా ఎయిర్ పోర్టులో తిరిగి ల్యాండ్ చేశారు. ఇంజిన్ కు…
విమానం ఓ కరెంట్ పోల్ ఢీకొన్న గటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది.. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్ట్‌లో.. ప్రయాణికులతో ఎస్‌జీ160 విమానం ఢిల్లీ నుంచి జమ్మూకు వెళ్లాల్సి ఉంది.. ప్రయాణికుల విమానం ఎక్కిన తర్వాత.. పుష్ బ్యాక్ చేస్తున్న సమయంలో విమానం కుడి వైపు రెక్క విద్యుత్ పోల్‌ను తాకింది.. స్పైస్‌జెట్ సంస్థకు చెందిన ఆ విమానం ప్రమాదవశాత్తు విద్యుత్ పోల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.. ప్రయాణికులను…