Sunrisers Hyderabad Fans Trolling Abdul Samad For Bad Performance: ఉప్పల్ స్టేడియం వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో సన్‌రైజర్స్ ఓటమి పాలైన విషయం తెలిసిందే! నిజానికి.. సన్‌రైజర్స్ మొదట్లో నిదానంగానే ఇన్నింగ్స్ మొదలుపెట్టిన, ఆ తర్వాత ఊపందుకోవడంతో ఆశలు చిగురించాయి. ముఖ్యంగా క్లాసెన్ ఆడిన మెరుపు ఇన్నింగ్స్ ఆడటం, అదే సమయంలో మయాంక్ కూడా రెచ్చిపోవడంతో.. ఈ మ్యాచ్ ‘వన్ సైడ్ నుంచి ఉత్కంఠభరితంగా’ మారింది. హైదరాబాద్ జట్టు లక్ష్యానికి చేరువ అవుతుండటంతో.. బహుశా వీళ్లు ఛేజ్ చేస్తారేమోనన్న ఆశలు సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌లో రేకెత్తాయి. వరుసగా వికెట్లు పడుతున్నప్పటికీ.. వచ్చిన బ్యాటర్లు తమవంతు ఎంతో కొంత సహకారం అందిస్తూ, జట్టుని లక్ష్యం దిశగా తీసుకెళ్తున్నారు. ఆఖరి 5 ఓవర్లలో 60 పరుగులు చేయాల్సి ఉన్నప్పుడు.. సన్‌రైజర్స్ విజయం తథ్యమని అంతా భావించారు.
Heart attack: ఆగిన మరో చిన్ని గుండె.. అమెరికాలో ఖమ్మం వైద్య విద్యార్థి మృతి
కానీ.. ఆ సమయంలో సన్‌రైజర్స్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన అబ్దుల్ సమద్ మాత్రం దారుణ ప్రదర్శన కనబర్చి, అభిమానుల ఆశలపై నీళ్లు చల్లేశాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన అతగాడు.. ముంబై జట్టుకి సమాధి కడతానుకుంటే, సన్‌రైజర్స్‌నే ముంచేత్తాడు. 13 బంతులు ఎదుర్కొన్న అతగాడు.. కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు. అందులో ఒకే ఒక బౌండరీ ఉంది. ఓవైపు చివర్లో వచ్చిన బౌలర్లు సైతం జట్టును గెలిపించాలన్న కసితో షాట్లు కొడుతుంటే.. సమద్ మాత్రం కనీస ప్రయత్నం కూడా చేయలేదు. అతడు క్రీజులో ఉన్నప్పుడు వచ్చిన జాన్‌సెన్(13), సుందర్(10) మంచి ప్రదర్శన కనబర్చారు. తమ వంతు న్యాయం చేసి వెళ్లారు. కానీ.. ఆఖరి ఓవర్ వరకు క్రీజులో ఉన్న సమద్ మాత్రం, అవసరం లేని పరుగుకి ప్రయత్నించి ఔటయ్యాడు. ఒకరకంగా చెప్పాలంటే.. సన్‌రైజర్స్ ఓటమికి సమద్ ఒక కారుకుడిగా నిలిచాడు. ఒకవేళ ఇతర ప్లేయర్ల మాదిరి ఇతడు కూడా షాట్లు కొట్టి ఉంటే.. బహుశా హైదరాబాద్ జట్టు గెలిచి ఉండేదేమో!
Wealthiest Cities: ప్రపంచంలోని 10 అత్యంత ధనిక నగరాలు (2023 జాబితా)
కానీ.. కనీసం ప్రయత్నం కూడా చేయకుండా దారుణ ప్రదర్శన కనబర్చినందుకు గాను.. సన్‌రైజర్స్ అభిమానులు అబ్దుల్ సమద్‌పై మండిపడుతున్నారు. సమద్ వల్లే మ్యాచ్ ఓడిపోయిందంటూ సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. ‘నీ ఆటకు ఓ దండం రా బాబు.. వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకో పో.. కీలక సమయంలో ఇలాగేనా ఆడేది.. పైగా ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చాడు’’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. అతని స్థానంలో మరొకరిని పంపించి ఉన్నా బాగుండేదంటూ అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. మరి.. ఈ ట్రోలింగ్స్‌కు సమద్ తదుపరి మ్యాచ్‌లోనైనా సమాధానం చెప్తాడా? లేక చెత్త ప్రదర్శనతోనే నిరాశపరుస్తాడా? లెట్స్ వెయిట్ అండ్ సీ!