అక్రమంగా అమెరికాలో ప్రవేశించిన భారతీయుల పరిస్థితి దారుణంగా తయారైంది. అమెరికా అధికారుల చేతుల్లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లక్షలు.. లక్షలు అప్పు చేసి అమెరికా చేరుకుంటే.. తీరా అక్కడ దిగగానే అధికారుల చేతుల్లో చిక్కుకుని ముప్పు తిప్పలు పడుతున్నారు. తాజాగా పంజాబ్‌కు చెందిన సౌరవ్ తనకు ఎదురైన పరిస్థితిని వివరించి కన్నీటి పర్యంతం అయ్యారు. అమెరికా నుంచి అమృత్‌సర్‌కు వచ్చిన రెండో విమానంలో సౌరవ్ ఉన్నారు. ఓ ఏజెంట్ చేతిలో మోసపోయి.. తిరిగి భారత్‌కు చేరుకున్నాడు.
ఇది కూడా చదవండి: Tollywood: శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల ఆహ్వానం అందుకున్న టాలీవుడ్ హీరోలు..
సౌరవ్.. పంజాబ్ వాసి. కుమారుడి భవిష్యత్ కోసం తల్లిదండ్రులు భూమి అమ్మి రూ.45లక్షలు ఇచ్చి సౌరవ్‌ను అమెరికాకు పంపించారు. జనవరి 27న మెక్సికో ద్వారా అమెరికాలోకి ప్రవేశించాడు. అంతే 2-3 గంటల వ్యవధిలోనే సౌరవ్‌ను అమెరికా పోలీసులు పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. దాదాపు 15-18 రోజులు శిబిరాల్లో ఉంచిన తర్వాత తిరిగి భారత్‌కు పంపేశారు. ఆదివారం అమృత్‌సర్‌లో దిగిన అమెరికా విమానంలో సౌరవ్ ఉన్నారు. ఈ సందర్భంగా తనకెదురైన ఇబ్బందులను మీడియాతో పంచుకున్నాడు.
‘‘నేను జనవరి 27న అమెరికాలోకి ప్రవేశించాను. అమెరికాలోకి ప్రవేశించిన 2-3 గంటల్లోనే పోలీసులు మమ్మల్ని పట్టుకున్నారు. మమ్మల్ని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. 2-3 గంటల తర్వాత మమ్మల్ని ఒక శిబిరానికి తీసుకెళ్లారు. మేము 15-18 రోజులు శిబిరంలోనే ఉన్నాం. మా మాట వినడానికి ఎవరూ లేరు. రెండు రోజుల క్రితం మమ్మల్ని వేరే శిబిరానికి తరలిస్తున్నట్లు చెప్పారు. మేము విమానం ఎక్కినప్పుడు, మమ్మల్ని భారతదేశానికి తిరిగి పంపుతున్నట్లు చెప్పారు..’’ అని సౌరవ్ అన్నారు. ‘‘విమానంలో మా చేతులు, కాళ్ళు కట్టేశారు. మమ్మల్ని పట్టుకున్న క్షణంలోనే మా మొబైల్ ఫోన్లు జప్తు చేశారు.’’ అని సౌరవ్ చెప్పాడు. తన కుటుంబంతో ఎలాంటి సంబంధం లేదని వాపోయాడు. తన కుటుంబం రూ.45లక్షలు అప్పు చేసి పంపించినట్లు తెలిపాడు. ప్రభుత్వాలే తమను ఆదుకోవాలని డిమాండ్ చేశాడు.
ఇది కూడా చదవండి: Champions Trophy 2025: పాకిస్తాన్‌లో భారత జెండా వివాదం.. కరాచీ స్టేడియం వీడియో వైరల్
అమెరికా ప్రయాణం కోసం సౌరవ్ డిసెంబర్ 17న భారత్ నుంచి బయల్దేరాడు. అక్కడ నుంచి మలేషియాకు.. అక్కడ 10 రోజులు ఉండి.. అనంతరం ఆమ్ట్స్‌ర్డామ్, పనామా, టపాచులా, చివరకు మెక్సికో నగరానికి విమానంలో వెళ్లి అమెరికా సరిహద్దును దాటినట్లు తెలిపాడు. అయితే అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించడానికి ఏర్పాట్లు చేసిన ఏజెంట్ పేరును మాత్రం వెల్లడించడానికి నిరాకరించారు.
ఇది కూడా చదవండి: Producer SKN: తెలుగు హీరోయిన్లపై ప్రొడ్యూసర్ ఎస్ కె ఎన్ కామెంట్స్ వైరల్..