ప్రోడ్యూసర్ ఎస్ కె ఎన్ గురించి పరిచయం అక్కర్లేదు. సినిమాల విషయం పక్కన పెడితే ఆయన ఎప్పుడు స్టేజి ఎక్కిన సంచలన వ్యాఖ్యలు చేస్తుంటాడు. అలా ఇప్పటికే ఎన్నో సార్లు వార్తల్లో నిలిచాడు. ఇక తాజాగా ఎస్ కె ఎన్ చేసిన కామెంట్స్ టాలీవుడ్ లో మరోసారి వివాదంగానూ, చర్చనీయాంశంగానూ మారేలా ఉన్నాయి. ఇంతకీ ఏం జరిగింది అంటే..
‘లవ్ టుడే’ మూవీతో తమిళ నటుడు కమ్ దర్శకుడు ప్రదీప్ రంగనాథ్ తెలుగులో కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఎక్కువగా యువత కి కనెక్ట్ అయ్యే కంటెంట్ ఉన్న కథలు ఎంచుకునే ప్రదీప్ తాజాగా ‘డ్రాగన్’ అనే మూవీతో రాబోతున్నాడు. ఇందులో అనుపమ పరమేశ్వరన్, కాయడు లోహర్ ప్రధాన పాత్రల్లో నటించగా, ఫిబ్రవరి 21న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ రిలీజ్ చేస్తుంది. దీంతో తాజాగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. కాగా ఈ ఈవెంట్‌కి డైరెక్టర్ హరీష్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరు కాగా, బేబీ చిత్ర నిర్మాత ఎస్ కె ఎన్ కూడా అతిథిగా పాల్గొన్నారు.
ఇందులో భాగంగా హీరోయిన్ కాయడు లోహర్ గురించి ఎస్ కె ఎన్ మాట్లాడుతూ.. ‘మీకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కి స్వాగతం. టాలీవుడ్‌లో మేము తెలుగు వచ్చిన హీరోయిన్ల కంటే తెలుగు రాని హీరోయిన్లనే ఎక్కువగా ఇష్టపడతాం. ఎందుకంటే తెలుగు వచ్చిన అమ్మాయిలని ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందో నాకు అనుభవం అయింది. ఇక నుంచి నేను, నా డైరెక్టర్ సాయి రాజేష్ తెలుగు రాని హీరోయిన్లని ఎంపిక చేసుకోవాలని డిసైడ్ అయ్యాం’ అని తెలిపారు. ఎస్ కె ఎన్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. అయితే ఎస్ కె ఎన్ నిర్మించిన ఓ సినిమాలోని హీరోయిన్ నుద్దేశించే ఇలా అన్నాడని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు
Also Read:Karan johar: రాజమౌళి సినిమాలపై కరణ్ జోహార్ వైరల్ కామెంట్స్