దేశ వ్యాప్తంగా నెలకొన్న ఇండిగో సంక్షోభం అందరికీ తెలిసిందే. గత ఐదు రోజులుగా ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు వర్ణించలేనివి. తిండి తిప్పలు లేకుండా ఎయిర్‌పోర్టుల్లో నరకయాతన పడుతున్నారు. ఇదేం దుస్థితి బాబోయ్ అంటూ గగ్గోలు పెడుతున్నారు.
ఇండిగో ఎయిర్‌లైన్ సంక్షోభం దేశ సర్వోన్నత న్యాయస్థానానికి చేరింది. ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ స్పందించాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది.
ఇండిగో ఎయిర్‌లైన్ సృష్టించిన సంక్షోభం అంతా ఇంతా కాదు. మంచి ఫీక్ సమయం చూసుకుని దెబ్బకొట్టింది. సహజంగా డిసెంబర్‌లో ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటిది ఎవరి మీద కోపం.. ప్రయాణికులపై చూపించినట్లైంది.