ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ హత్య కేసు మిస్టరీని మేఘాలయ పోలీసులు ఛేదిస్తున్నారు. ఇప్పటికే పలు కీలక విషయాలను పోలీసులు రాబట్టారు. తాజాగా ప్రధాన నిందితులైన సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహాకు చెందిన మొబైల్స్‌ను పరిశీలించారు.
భర్త రాజా రఘువంశీని ప్రియుడు రాజ్ కుష్వాహా సహకారంతో సోనమ్ చంపేసిందని పోలీసులు వెల్లడించారు. మే 11న రాజా రఘువంశీ-సోనమ్‌కి వివాహం జరిగింది. మే 20న మేఘాలయ హనీమూన్‌కు వెళ్లి మే 23న అదృశ్యమయ్యారు. జూన్ 2న రాజా రఘువంశీ మృతదేహం లభ్యం అయింది.