Gandhi father of Pakistan: మహాత్మా గాంధీని పాకిస్థాన్‌కు ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని పిలిచినందుకు సింగర్ అభిజీత్ భట్టాచార్యకు పూణేకు చెందిన న్యాయవాది అసిమ్ సోర్డే లీగల్ నోటీసు పంపారు. తన క్లయింట్ మనీష్ దేశ్‌పాండే తరపున పంపిన ఈ నోటీసుల్లో భట్టాచార్య క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన క్షమాపణలు చెప్పకపోతే, అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని ఆ లీగల్ నోటీసుల్లో తెలిపారు.
Read Also: Dense Fog: ఢిల్లీలో పొగమంచు ఎఫెక్ట్.. ఆలస్యంగా నడుస్తున్న విమానాలు, రైళ్లు..
అయితే, గత నెలలో సంగీత స్వరకర్త ఆర్‌డి బర్మన్ మహాత్మా గాంధీ కంటే పెద్దవాడని, కరంచంద్ గాంధీ పాకిస్తాన్‌కు ‘జాతి పితామహుడు’ భారతదేశానికి కాదు అని అభిజిత్ భట్టాచార్య చేసిన కామెంట్స్ వివాదానికి దారి తీశాయి. భారత్ ఎప్పటి నుంచో ఉంది.. పాకిస్తాన్ మాత్రం భారతదేశం నుంచి ఉద్భవించింది అన్నాడు. ఇక, గాంధీని భారతదేశానికి జాతిపిత అని పొరపాటుగా పిలిచారు అని పేర్కొన్నాడు. దీంతో, భారతదేశం ప్రపంచవ్యాప్తంగా “మహాత్మా గాంధీకి చెందిన దేశం”గా గుర్తించబడిందని గాయకుడు భట్టాచార్య చేసిన వ్యాఖ్యలు మహాత్మా గాంధీ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని తన లీగల్ నోటీసులో న్యాయవాది అసిమ్ సోర్డే పేర్కొన్నారు.
Read Also: Daaku Maharaj : ‘డాకు మహారాజ్’లో మెయిన్ హైలైట్స్ అవేనట
ఇక, భారతదేశం ఎప్పుడూ ఉనికిలో ఉంది.. పాకిస్థాన్ పొరపాటున సృష్టించబడిందని సింగర్ అభిజిత్ భట్టాచార్య మూర్ఖపు ప్రకటన చేశారని మనీష్ తరపు అడ్వకేట్ అసిమ్ సోర్డే పేర్కొన్నారు. ఈ ప్రకటన మహాత్మా గాంధీ జీ పట్ల మీ మనస్సులో ద్వేషాన్ని చూపిస్తుంది అని లీగల్ నోటీసులో పేర్కొన్నారు. తక్షణమే భట్టాచార్య క్షమాపణలు చెప్పాలి, లేకపోతే అతనిపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 353 (పబ్లిక్ దుర్మార్గం), సెక్షన్ 356 (పరువు నష్టం) కింద ఫిర్యాదు చేస్తామని నోటీసులో సోర్డే వెల్లడించారు.