Daaku Maharaj : గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తన 109వ చిత్రం బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు ‘డాకు మహారాజ్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో బాలకృష్ణను మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో దర్శకుడు బాబీ చూపిస్తున్న తీరుకి అందరూ ఫిదా అయ్యారు. రీసెంటుగా రిలీజ్ అయిన దాకు మహారాజ్ ట్రైలర్ కు ప్రశంసలు అందుకోవడమే కాకుండా అంచనాలను అమాంతం పెంచేసింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో ప్రగ్య జైస్వాల్, ఊర్వశి రౌతేలా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీగా ప్లాన్ చేశారు నిర్మాత నాగవంశీ.
Read Also:Allu Arjun: అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు
మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ మొదలయ్యాయి. ఇందులో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బాబీ ఈ సినిమాలో మెయిన్ హైలైట్స్ ను రివీల్ చేశారు. బాబీ మాట్లాడుతూ.. ‘డాకు మహారాజ్’లో ఒక ఫైవ్ టు సిక్స్ సాలిడ్ ఎపిసోడ్స్ ఉంటాయి. ముఖ్యంగా బాలయ్య సినిమా నుంచి అభిమానులు ఏదైతే కోరుకుంటారో.. అవన్నీ ఈ సినిమాలో ఉంటాయి. అదేవిధంగా బాలయ్య పాత్రలో మూడు వేరియేషన్స్ ఉంటాయి. ఆ మూడో వేరియేషన్ కోసం బెస్ట్ ఎపిసోడ్ ని డిజైన్ చేశారు డైరెక్టర్. నా దృష్టిలో అది సినిమాలోనే మెయిన్ హైలైట్’ అని చెప్పుకొచ్చారు.
Read Also:SSMB 29: రాజమౌళి టార్గెట్ రూ.వెయ్యి కోట్లు కాదు.. ఏకంగా ఎన్ని వేల కోట్లంటే ?
యాక్షన్ ఒక్కటే కాదు, వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఈ సినిమాలో ఉంటాయి. బాలయ్య పాత్రలో అద్భుతమైన ఎమోషన్ ఉంటుంది. సెకండ్ హాఫ్ లో ఓ 30నిమిషాల ఎపిసోడ్ కూడా చాలా బాగుంటుంది. ఒక్క మాటలో ‘డాకు మహారాజ్’లో అద్భుతమైన యాక్షన్ తో పాటు ఇంత బ్యూటిఫుల్ ఎమోషన్ ఎలా పండించారు ? అని మీరు అడుగుతారు’ అంటూ బాబీ చెప్పుకొచ్చారు. డాకు మహారాజ్ సినిమా జనవరి 12, 2025న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది.