Punjab: పంజాబ్ పోలీసులు, కేంద్రబలగాలు ఖలిస్తానీ వేర్పాటువాది, ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృత్ పాల్ సింగ్ కోసం జల్లెడ పడుతున్నాయి. గత రెండు రోజులుగా అతడి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటికే ఆయన మద్దతుదారులు 78 మందిని లోపలేశారు. ఇదిలా ఉంటే కొంతమంది కెనడా, యూకే సిక్కు ఎంపీలు మాత్రం పంజాబ్ పరిస్థితిపై మొసలి కన్నీరు కారుస్తున్నారు. పంజాబ్ లో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు.