Karnataka: సీఎం సిద్ధరామయ్య ఇంటికి మంత్రులు, ఎమ్మెల్యేలు.. రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్..
- ముడా భూ కుంభకోణంలో సిద్ధరామయ్యకు హైకోర్టు షాక్..
- రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ..
- సిద్ధరామయ్య ఇంటికి మంత్రులు.. ఎమ్మెల్యేలు..
- సుప్రీంని ఆశ్రయించే యోచనలో సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: ముడా భూ కుంభకోణం కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ముడా స్కామ్‌లో సిద్ధరామయ్యను విచారించేందుకు కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ అనుమతి ఇచ్చారు. అయితే, దీనిని సవాల్ చేస్తూ కర్ణాటక హైకోర్టుని ఆశ్రయించిన సిద్ధరామయ్యకు బిగ్ షాక్ తగిలింది. ‘‘ ఈ కేసులో గవర్నర్ స్వతంత్రంగా వ్యవహరించారని, వాస్తవాలు వెలుగులోకి తేవాలి’’ అని హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ నాగ ప్రసన్న అన్నారు. సిద్ధరామయ్య వేసిన పిటిషన్‌ని కొట్టేశారు.
Read Also: CM Chandrababu: నామినేటెడ్ పోస్టుల భర్తీ.. సామాన్య కార్యకర్తలకు టీడీపీ పెద్దపీట..
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
- Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్‌కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
- Rahul Gandhi: రాహుల్‌గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
- Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
ఇదిలా ఉంటే, హైకోర్టు తీర్పు నేపథ్యంలో కర్ణాటకలో రాజకీయ చర్చ మొదలైంది. సిద్ధరామయ్య ఇంటికి మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్లారు. డిప్యూటీ సీఎం శివకుమార్ కూడా సీఎం ఇంటికి చేరుకున్నారు. మరోవైపు ఆయన ఇంటి ముందు భారీ పోలీస్ భద్రతని ఏర్పాటు చేశారు. సీఎంకు వ్యతిరేకంగా తీర్పు రావడంతో తదుపరి చర్యల గురించి కాంగ్రెస్ నేతలంతా చర్చిస్తున్నారు. సుప్రీంకోర్టుని సిద్ధరామయ్య ఆశ్రయిస్తారని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, హైకోర్టు తీర్పు సీఎంకి వ్యతిరేకంగా రావడంతో బీజేపీ తన స్వరాన్ని పెంచింది. సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయాలని బీజేపీ మంగళవారం డిమాండ్ చేసింది. అయితే, కాంగ్రెస్ నేతలు మాత్రం తమ ముఖ్యమంత్రిపై బీజేపీ కుట్ర చేసిందని ఆరోపించారు. సీఎం రాజీనామా చేసే ప్రశ్నే లేదని డిప్యూటీ సీఎం శివకుమార్ అన్నారు. ఈ తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎంకి చెంపపెట్టు అని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. గవర్నర్ చర్యల్లో ఎలాంటి తప్పు లేదని బీజేపీ కర్ణాటక చీఫ్ బీవై విజయేంద్ర అన్నారు. ముడా స్కామ్‌లో సిద్ధరామయ్య కుటుంబం పేరు వస్తున్నందున గౌరవంగా ఆయన రాజీనామా చేయాలని కోరారు.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్‌కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!