Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల చివర్లో కాంగ్రెస్ ప్రభుత్వం తన ఐదేళ్ల పదవీ కాలంలో సగం కాలం పూర్తి చేసుకోబోతోంది. ఈ నేపథ్యంలో సీఎం మార్పు ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మద్దతుదారులు ఆయన తదుపరి సీఎం కావాలని డిమాండ్ చేస్తున్నారు. సోమవారం రాష్ట్ర నాయకత్వ మార్పుపై రిపోర్టర్ అడిగిన ప్రశ్నపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు జరగబోతుందంటూ ఇటీవల పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. కొంత మంది ఎమ్మెల్యేలు కూడా ఆ ప్రకటన చేశారు. డీకే. శివకుమార్‌కు 100 మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉందని.. ఇప్పుడు ముఖ్యమంత్రి మార్పు జరగకపోతే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోతుందని ఆ పార్టీ ఎమ్మెల్యే ఒకరు మీడియాతో చెప్పారు.
Congress: ముఖ్యమంత్రి మార్పు, ఎమ్మెల్యేలు మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలతో కర్ణాటక కాంగ్రెస్‌లో వర్గవిభేదాలు తారాస్థాయికి చేరాయి. పరిస్థితి సిద్ధరామయ్య వర్సెస్ డీకే శివకుమార్‌గా మారింది. తర్వలోనే ముఖ్యమంత్రి మార్పు ఉంటుందని కొందరు ఎమ్మెల్యేలు కామెంట్ చేస్తుంటే, మరికొందరు సిద్ధరామయ్యే మా సీఎం అని చెబుతున్నారు. దీంతో కర్ణాటకలో రాజకీయ రసవత్తరంగా మారింది.