Shree Cement: శ్రీ సిమెంట్ 23000 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణ.. భారీగా పడిపోయిన షేర్లు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shree Cement: దేశంలోనే అతిపెద్ద సిమెంట్ కంపెనీలలో శ్రీ సిమెంట్ ఒకటి. అయితే ఆ కంపెనీ రూ.23,000 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీని కారణంగా సోమవారం కంపెనీ షేర్లు 10 శాతం పడిపోయాయి. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ నుండి దాదాపు రూ.9200 కోట్లు నష్టపోయాయి. ట్రేడింగ్ సమయంలో కంపెనీ షేరు రూ.25 వేల స్థాయి నుంచి రూ.22 వేల స్థాయికి దిగజారింది. ప్రస్తుతం కంపెనీ షేరు రూ.23 వేల స్థాయిలో ట్రేడవుతోంది. ఆదాయపు పన్ను శాఖ గత వారం సిమెంట్ తయారీదారులకు చెందిన ఐదు ప్రదేశాలను సర్వే చేసే ప్రక్రియను ప్రారంభించింది. అందులో భాగంగా బీవార్, జైపూర్, చిత్తోర్‌గఢ్, అజ్మీర్‌లోని కంపెనీ స్థావరాలపై దాడులు జరిగాయి. గత రెండు ట్రేడింగ్ రోజుల్లో కంపెనీ షేర్లు 12 శాతానికి పైగా క్షీణించాయి.
Read Also: Visakhapatnam: విశాఖలో చిక్కుకున్న ఎయిరిండియా ఫ్లైట్.. NTV కథనానికి స్పందన
Also Read
- MDMA Factory: ఇంత టాలెంటెడ్ గా ఉన్నావేంట్రా నువ్వు.. ఇంట్లోనే MDMA తయారీ కేంద్రం పెట్టేశావ్.!
- PM Modi: ఎర్రకోట వేదికగా యూత్‌కు ప్రధాని మోడీ గుడ్‌న్యూస్.. కోటి మంది యువతకు ఉచితంగా..
- PM Modi: ప్రభుత్వ అధికార వర్గాల్లోనూ మావోయిస్టు భావజాలం.. 'అర్బన్ నక్సల్స్'ను సమాజం దూరం పెట్టాలి..
- Trisha Krishnan: సీఎం విజయ్ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో త్రిష.. ఫ్రంట్ రోలో కూర్చుని సెల్యూట్
ఆదాయపు పన్ను సర్వేపై సిమెంట్ కంపెనీ తన పత్రికా ప్రకటనలో ఒక విషయాన్ని స్పష్టం చేసింది. కంపెనీ మొత్తం మేనేజ్మెంట్, అధికారులకు పూర్తి సహకరిస్తున్నదని.. అంతేకాకుండా మీడియాలో ప్రసారం అవుతున్న సమాచారం తప్పు అని పేర్కొంది. సర్వేకు సంబంధించి కొన్ని మీడియా సెక్షన్లలో.. కంపెనీ మరియు అధికారుల గురించి ప్రతికూలంగా మాట్లాడుతున్నట్లు కంపెనీ తెలిపింది. అంతేకాకుండా ఆదాయపు పన్ను సర్వే ఇంకా కొనసాగుతోందని కంపెనీ పేర్కొంది.
Read Also: Suraj Kumar: ఘోర రోడ్డు ప్రమాదం.. హీరో కాలు తీసేసిన వైద్యులు
ఉదయం 11:57 గంటలకు కంపెనీ షేరు బిఎస్ఇలో దాదాపు 8 శాతం క్షీణించి రూ.23,150 వద్ద ట్రేడవుతోంది. అంతేకాకుండా గత సంవత్సరం కంపెనీ స్టాక్ 22 శాతం పెరిగింది. ఫిబ్రవరి 21న కంపెనీ షేరు రూ.27,000 స్థాయిని దాటింది. ఈరోజు ట్రేడింగ్ సెషన్లో, కంపెనీ స్టాక్ రూ. 22601.30తో రోజు కనిష్ట స్థాయికి చేరుకుంది. శుక్రవారం చివరి ట్రేడింగ్ రోజున రూ.25,144.85 వద్ద ముగిసింది. మరోవైపు కంపెనీ షేర్ల పతనం కారణంగా, ట్రేడింగ్ సెషన్లో కంపెనీ మార్కెట్ భారీగా క్షీణించింది. శుక్రవారం స్టాక్ మార్కెట్ ముగిసినప్పుడు బిఎస్ఇలో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.90,724.49 కోట్లుగా ఉంది. నేటి ట్రేడింగ్ సెషన్లో ఇది రూ.22601.30కి చేరి ఆపై రూ.81,547.17 కోట్లకు తగ్గింది. అంటే కేవలం కొన్ని గంటల వ్యాపారంలో కంపెనీ దాదాపు రూ.92 కోట్ల నష్టాన్ని చవిచూసింది.
తాజావార్తలు
-
Team India: బ్రిటీషర్ల గడ్డపై స్వాతంత్య్ర దినోత్సవం.. లండన్‌లో జెండా ఎగరేసిన విరాట్ కోహ్లీ.. గుర్తుందా?
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
20 Lakh Jobs in AP: 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం.. పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానం.. యువతకు సీఎం భరోసా
-
Sridevi Biography: శ్రీదేవి బయోగ్రఫీని లాంచ్ చేసిన ప్రియాంక .. 300 సినిమాల ప్రయాణం, 150 అరుదైన ఫోటోలతో ‘ఎంప్రెస్’!
-
India 1947 vs 2026 Prices: బంగారం నుంచి పెట్రోల్ వరకు.. 1947లో ఎంత? ఇప్పుడు ఎంత? ధరల పూర్తి జాబితా
ట్రెండింగ్
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్‌లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!