Suraj Kumar: కన్నడ నటుడు సూరజ్ కుమార్ కు రెండు రోజుల క్రితం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెల్సిందే. సూరజ్ కుమార్ అలియాస్ ధృవన్.. శనివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మైసూర్- గుడ్లపెట్ జాతీయ రహదారిలో బైక్ పై వెళ్తుండగా.. ట్రాక్టర్ ను ఓవర్ టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలు కాగా వెంటనే ధృవన్ ను దగ్గర్లో ఉన్న హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఇక ఈ ప్రమాదంలో అతడి కుడి కాలు బైక్ కు లారీకి మధ్య ఇరుక్కొని నుజ్జు నుజ్జు కావడంతో ఆ కాలును తీసివేశారని తెలుస్తోంది. ప్రాణాలకు అయితే ప్రమాదం లేదని, కాలు మాత్రమే తీసేసినట్లు వవైద్యులు తెలిపినట్లు సమాచారం.
Bhaag Saale: కీరవాణి కొడుకు సినిమాలో ఎన్టీఆర్, చరణ్… థియేటర్స్ లో నవ్వులే
ఇక దీంతో కన్నడనాట విషాద ఛాయలు అలముకున్నాయి. ఇప్పుడిప్పుడే హీరోగా మంచి ఛాన్స్ లు అందుకుంటున్న ధృవన్ కు ఇలా జరగడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుందని అభిమానులతో పాటు పలువురు ఇండస్ట్రీ పెద్దలు చెప్పుకొస్తున్నారు. ఇక ఇంకోపక్క ప్రాణాలతో ఉన్నాడు.. అది చాలు ఆ కుటుంబానికి అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ధృవన్ యాక్సిడెంట్ వార్త నెట్టింట వైరల్ గా మారింది. అతను త్వరగా కోలుకొని ఇంటికి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ధృవన్.. సినీ నిర్మాత ఎస్ఏ శ్రీనివాస్ తనయుడు కావడంతో ఇండస్ట్రీ పెద్దలు ఆయనను కూడా ఓదారుస్తున్నారు. వయసొచ్చిన కొడుకు ఇలా ప్రమాదంలో కాలు పోగొట్టుకుంటే భరించడం తల్లిదండ్రులు భరించలేరని, వారికి దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నారు.