Cement Price Hike: పెరుగుతున్న ద్రవ్యోల్బణం మధ్య సొంత ఇంటి కలను నిర్మించుకోవాలనే సామాన్యుల కోరికకు గండిపడనుంది. ఎందుకంటే గత నెలతో పోలిస్తే సిమెంట్ తయారీ కంపెనీలు దాని ధరను 12 నుండి 13 శాతం పెంచాయి.
దేశంలోనే అతిపెద్ద సిమెంట్ కంపెనీలలో శ్రీ సిమెంట్ ఒకటి. అయితే ఆ కంపెనీ రూ.23,000 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీని కారణంగా సోమవారం కంపెనీ షేర్లు 10 శాతం పడిపోయాయి. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ నుండి దాదాపు రూ.9200 కోట్లు నష్టపోయాయి. ట్రేడింగ్ సమయంలో కంపెనీ షేరు రూ.25 వేల స్థాయి నుంచి రూ.22 వేల స్థాయికి దిగజారింది. ప్రస్తుతం కంపెనీ షేరు రూ.23 వేల స్థాయిలో ట్రేడవుతోంది.