IND vs BAN: పాకిస్తాన్‌పై భారీ విజయాన్ని సాధించిన భారత్.. ఆసియా కప్ 2025 సూపర్ 4లో తన తదుపరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో నేడు (సెప్టెంబర్ 24) తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో స్పిన్నర్ల పాత్ర కీలకమని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు రెండు జట్ల మధ్య జరిగిన 17 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో బంగ్లాదేశ్ ఒక్కసారి మాత్రమే విజయం సాధించగలిగింది. గణాంకాల…
India Bangladesh: షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి ఇండియాకు వచ్చిన తర్వాత, బంగ్లాదేశ్‌లోని మహ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం భారత వ్యతిరేక ప్రచారాన్ని ఎక్కువ చేసింది. మైనారిటీలు ముఖ్యంగా హిందువుల ఆస్తులు, దేవాలయాలు, వ్యాపారాలను మతోన్మాదులు టార్గెట్ చేస్తున్నా యూనస్ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పలు సందర్భాల్లో మైనారిటీలపై దాడుల గురించి ఇండియా ఎన్నిసార్లు చెప్పినా లెక్క చేయడం లేదు. దీంతో, బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలేలా భారత్ సంచలన నిర్ణయాలు…
Bangladesh: బంగ్లాదేశ్‌లో మైనారిటీలు ముఖ్యంగా హిందువుల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. తాజాగా, ఆ దేశ రాజధానిలో దుర్గా మాత ఆలయాన్ని కూల్చివేశారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై భారత్ నుంచి తీవ్ర ప్రతిస్పందన వచ్చింది. మరోవైపు, బంగ్లాదేశ్ అధికారులు ఈ చర్యను సమర్థించారు. ఆలయం తాత్కాలిక నిర్మాణం అని, చట్టవిరుద్ధంగా నిర్మించారని పేర్కొన్నారు.
Bangladesh: భారత అధికారులు ఎలాంటి పత్రాలు లేని వ్యక్తుల్ని బంగ్లాదేశ్‌లోకి తోసేయడం ఆమోదయోగ్యం కాదని, అవసరమైతే తమ సైన్యం రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉందని బంగ్లాదేశ్ ఆర్మీ ఉన్నతాధికారి సోమవారం అన్నారు. బంగ్లాదేశ్ సరిహద్దు రక్షణ దళం, బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (BGB) ప్రస్తుతానికి పరిస్థితిని చక్కగా నిర్వహిస్తోందని మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టరేట్ (MOD) డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ ఎండీ నజీమ్-ఉద్-దౌలా అన్నారు.
Bangladesh: భారత్ అంటేనే ద్వేషంతో రగిలిపోతున్నాడు బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడు మహ్మద్ యూనస్. షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఇతను భారత్ వ్యతరేక ప్రచారాన్ని బంగ్లాదేశ్‌లో ముమ్మరం చేశాడు. భారత్ అంటే పడని జమాతే ఇస్లామీ, బీఎన్పీ పార్టీ నేతల్ని తన సలహాదారుగా ఎంపిక చేసుకున్నాడు. ఆ తర్వాత, భారత ప్రత్యర్థి పాకిస్తాన్‌తో సంబంధాలు మెరుగుపరుచుకుంటున్నాడు. 1970లో బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్ సైన్యం చేసిన దురాగతాలను మరిచిపోయి స్నేహ హస్తం అందిస్తు్న్నాడు. ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్…
India Bangladesh: బంగ్లాదేశ్‌కి భారత్ భారీ షాక్ ఇచ్చింది. బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి దిగుమతి అవుతున్న కొన్ని వస్తువులపై పోర్టు ఆంక్షలు విధించారు. ఆ దేశం నుంచి రెడీమెడ్ దుస్తులు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల వంటి కొన్ని దిగుమతులపై ఆంక్షలు పెట్టింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) ఈ విషయంపై నోటిఫికేషన్ జారీ చేసింది. బంగ్లాదేశ్ వస్త్ర దిగుమతులను కోల్‌కతా, ముంబై ఓడరేవులకు వరకే పరిమితం చేసింది.…
India Bangladesh: బంగ్లాదేశ్‌లోని మహ్మద్ యూనస్ సర్కార్‌కి భారత్ షాక్ ఇచ్చింది. ఆ దేశంలో చేపట్టిన రైల్వే ప్రాజెక్టును నిలిపేసింది. రాజకీయ గందరగోళం, కార్మికుల భద్రత కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాంతంలో స్థిరత్వం, వ్యూహాత్మక భద్రతను నిర్ధారించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
India Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువులపై హింస ఆగడం లేదు. హిందూ నాయకుడు భబేష్ చంద్ర రాయ్‌ని కిడ్నాప్ చేసి, హత్య చేయడంపై భారత్ తీవ్రంగా స్పందించింది. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం హిందువులతో సహా అన్ని మైనారిటీలను రక్షించే బాధ్యతను నిర్వర్తించాలని భారత్ పిలుపునిచ్చింది.
Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా, తాత్కాలిక దేశాధినేత మహ్మద్ యూనస్‌కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆయనను విదేశాలతో కలిసి దేశ పతనానికి కుట్ర పన్నిన "స్వార్థపరుడైన రుణగ్రహీత"గా అభివర్ణించారు. విద్యార్థి నిరసనకారుడు అబూ సయీద్‌ను చంపిన దానిపై కూడా ఆమె సందేహాలను లేవనెత్తారు.
Bangladesh: బంగ్లాదేశ్ దూకుడుకు భారత్ కళ్లెం వేస్తోంది. ఇటీవల చైనా పర్యటనలో ఆ దేశ తాత్కాలిక అధినేత మహ్మద్ యూనస్ మాట్లాడుతూ.. భారత్ దేశానికి చెందిన ఈశాన్య రాష్ట్రాలు ల్యాండ్ లాక్డ్గా ఉన్నాయని, బంగ్లాదేశ్ బంగాళాఖాతానికి సంరక్షకుడిని, చైనా తమ దేశం ద్వారా ఆ ప్రాంతానికి విస్తరించవచ్చని వ్యాఖ్యానించాడు. అయితే, ఈ వ్యాఖ్యల్ని భారత్ సీరియస్‌గా తీసుకుంటోంది. చైనా పెట్టుబడుల్ని ఆకర్షించే పనిలో, పరోక్షంగా భారత్‌ని దెబ్బతీసే ప్రయత్నంలో బంగ్లాదేశ్ ఉందని భారత అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు…