Shashi Tharoor: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌తో భేటీ అవ్వడం, ఆయనకు లంచ్ ఆతిథ్యం ఇవ్వడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ అంశంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్పందించారు. 2001లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఉగ్రవాద దాడి వెనక అల్ ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ ఉన్నాడని, దాదాపు 3000 మందిని చంపిన అతను పాకిస్తాన్ లోని అబోటాబాద్ ఆర్మీ క్యాంప్ సమీపం దాక్కున్న విషయాన్ని థరూర్ గుర్తు చేశారు.
Read Also: Israel Iran War: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని చంపేస్తాం.. ఇజ్రాయిల్ వార్నింగ్..
పాకిస్తాన్ ప్రతినిధి బృందాన్ని కొంతమంది సెనెటర్లు, కాంగ్రెస్ సభ్యులు కలిశారు, కానీ అమెరికా ప్రజలు ఒసామా బిన్ లాడెన్‌ని అంత త్వరగా మరిచిపోలేరని అన్నారు. బిన్ లాడెన్ దొరికే వరకు పాకిస్తాన్ అతడిని దాచిపెట్టింది, దీనిని అమెరికన్లు సులభంగా క్షమించలేరని అన్నారు. నకిలీ పాకిస్తాన్ పాలనను నమ్మవద్దని, ఎందుకంటే అది అమెరికా చరిత్రలోనే దారుణమైన ఉగ్రదాడికి కారణమైన ఉగ్రవాదికి ఆశ్రయం కల్పించిందని అన్నారు. పాకిస్తాన్ భారత్‌పై ఉగ్రదాడులకు మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు.
పాకిస్తాన్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఉగ్రవాదులు, వారికి ఆర్థిక సాయం, ఆయుధాలు, శిక్షణ, భారతదేశం పైకి ఉగ్రవాదుల్ని పంపించకుండా ట్రంప్, ఆసిమ్ మునీర్‌ని హెచ్చరించారని తాను ఆశిస్తున్నట్లు థరూర్ పేర్కొన్నారు. ట్రంప్-మునీర్ లంచ్‌పై థరూర్ మాట్లాడుతూ.. ఆహారం బాగుందని, ఈ ప్రక్రియలో ఆయన ఆలోచనకు కొంత ఆహారం లభిస్తుందని ఆశిస్తున్నానని అన్నారు.