దేశ రాజధాని ఢిల్లీలోని ఒక ప్రముఖ ఆశ్రమంలో లైంగిక వేధింపులు కలకలం రేపాయి. ఆశ్రమ డైరెక్టర్ స్వామి చైతన్యానంద సరస్వతి అలియాస్ పార్థ సారథిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇక సోదాల్లో నిందితుడికి సంబంధించిన కారును గుర్తించగా.. దానిపై నకిలీ ఎంబసీ ప్లేట్లు గుర్తించారు.
ఇది కూడా చదవండి: Typhoon Ragasa: తైవాన్, చైనాలో పెను విధ్వంసం సృష్టించిన తుఫాన్.. వీడియోలు వైరల్
ఢిల్లీలోని సంపన్న వసంత్ కుంజ్ ప్రాంతంలో శ్రీ శారదా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్ ఉంది. ఇది ఒక ప్రసిద్ధ ఆశ్రమం. ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన వారు (EWS) స్కాలర్‌షిప్‌తో పోస్ట్ గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ డిప్లొమా కోర్సులు చదువుతున్న విద్యార్థినులు ఉంటారు. ఇక్కడ ఆశ్రమ డైరెక్టర్‌గా స్వామి చైతన్యానంద సరస్వతి ఉన్నారు. అయితే నిత్యం సిబ్బంది అండదండలతో విద్యార్థినులను డైరెక్టర్ లైంగిక వేధిస్తున్నాడు. దీంతో బాధితులు వేధింపులు తాళలేక పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చదవండి: Trump-Shehbaz Sharif: యూఎన్‌లో ట్రంప్‌తో పాక్ ప్రధాని సంభాషణ.. రేపు వైట్‌హౌస్‌లో ప్రత్యేక భేటీ
32 మంది విద్యార్థినుల దగ్గర నుంచి వాంగ్మూలాలు సేకరించారు. 17 మంది విద్యార్థినులతో స్వామి చైతన్యాంద దుర్భాష ప్రయోగించినట్లుగా.. అంతేకాకుండా మొబైల్స్‌కు అసభ్యకరమైన టెక్ట్స్ సందేశాలు పంపించినట్లుగా గుర్తించారు. బలవంతంగా వారితో శారీరక సంబంధం పెట్టుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. అధ్యాపకులు, పరిపాలనా సిబ్బంది ప్రముఖ పాత్ర ఉందని.. విద్యార్థినులను ప్రోత్సహించినట్లుగా.. నిందితుడికి సహకరించాలని ఒత్తిడి చేసినట్లుగా పోలీసులు గుర్తించారు.
ఆశ్రమంలో పనిచేస్తున్న కొంతమంది వార్డెన్లు.. స్వామి చైతన్యానంద దగ్గరకు తీసుకెళ్లి పరిచయం చేశారని విద్యార్థినులు పోలీసుల దగ్గర వాపోయారు. సిబ్బంది ఒత్తిడితోనే ఇదంతా జరిగినట్లుగా తేలింది. విద్యార్థినుల వాంగ్మూలాల ఆధారంగా స్వామి చైతన్యానందపై లైంగిక వేధింపులు, ఇతర అభియోగాల కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లు నైరుతి జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అమిత్ గోయల్ తెలిపారు.
ఇక ఆశ్రమంలో సీసీటీవీ ఫుటేజీలను కూడా పోలీసులు విశ్లేషించారు. నేరం జరిగిన ప్రదేశంలో నిందితుడి చిరునామాతో ఉన్న ప్రాంతంలో దాడులు నిర్వహించారు. స్వామి చైతన్యానంద ఉపయోగించిన వోల్వో కారును గుర్తించారు. కారు నకిలీ దౌత్య నంబర్ ప్లేట్ (39 UN 1) ను ఉపయోగించినట్లు తేలింది. దీంతో కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఇంకా పరారీలో ఉన్నాడని.. చివరిసారిగా ఆగ్రా సమీపంలో ఉన్నట్లు పోలీస్ వర్గాలు సూచించాయి. పోలీసు బృందాలు నిందితుడి కోసం గాలిస్తున్నాయి.
లైంగిక ఆరోపణలు రావడంతో ఆశ్రమ పరిపాలన పదవి నుంచి స్వామి చైతన్యానందను తొలగించి బహిష్కరించింది. నిందితుడితో అన్ని సంబంధాలు తెంచుకున్నట్లు తెలిపింది. స్వామి చైత్యానంద ప్రవర్తన, కార్యకలాపాలు చట్టవిరుద్ధమైనవి, అనుచితమైనవి, పీఠ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని ప్రకటనలో పేర్కొంది. నిందితుడు నాయకత్వం వహించిన ఆశ్రమ విభాగం దక్షిణ భారతదేశంలోని ఒక ప్రముఖ ఆశ్రమానికి చెందిన శాఖగా తెలుస్తోంది.