ఢిల్లీ బాబా దురాగతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 2016లో చదివిన ఓ మాజీ విద్యార్థి సంచలన విషయాలు బయటపెట్టాడు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. స్వామిజీ చైతన్యానందకు అమ్మాయి నచ్చితే చాలు అదనపు సౌకర్యాలతో ప్రత్యేక గది లభించేదని తెలిపాడు.
ఢిల్లీ బాబా స్వామి చైతన్యానంద సరస్వతి లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పైకి బాబాగా దర్శనమిస్తున్నా.. లోపల ఉన్న అసలు స్వరూపాన్ని బయట పెట్టేవాడు. ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలోని శ్రీ శారదా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్‌గా.. తనను తాను ‘‘బాబా’’గా స్వామి చైతన్యానంద సరస్వతి చప్పుకునేవాడు.
దేశ రాజధాని ఢిల్లీలోని ఒక ప్రముఖ ఆశ్రమంలో లైంగిక వేధింపులు కలకలం రేపాయి. ఆశ్రమ డైరెక్టర్ స్వామి చైతన్యానంద సరస్వతి అలియాస్ పార్థ సారథిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇక సోదాల్లో నిందితుడికి సంబంధించిన కారును గుర్తించగా.. దానిపై నకిలీ ఎంబసీ ప్లేట్లు గుర్తించారు.