ఛత్తీస్‌గఢ్ ఆరోగ్య మంత్రి టీఎస్ సింగ్ డియో గురువారం మీడియాతో మాట్లాడారు. పిల్లలకు COVID-19 టీకాలు వేయకపోతే రాష్ట్రంలోని పాఠశాలలు తెరవబడవు. పాఠశాలలు తమ సిబ్బందికి 100% కరోనా వైరస్ ఇన్‌ఫెక్షన్‌కు వ్యతిరేకంగా టీకాలు వేసేలా చూసుకోవాలని ఆయన తెలిపారు. “ఇది పాఠశాలలను తిరిగి తెరవడం గురించి కాద ని ఆరోగ్య సంరక్షణ కోసమని ఆయన చెప్పారు. ఇప్పటికే కోవిడ్ వల్ల చాలా నష్టపోయాం భవిష్యత్ తరాన్ని కాపాడాటానికి మా ముందు ఉన్న ఏకైక నిర్ణయం ఇదేనని ఆయన తెలిపారు.
గత అనుభవానలు దృష్టిలో పెట్టుకుని రిస్క్ తీసుకోలేమని మంత్రి వెల్లడించారు. ప్రతీ ఒక్కరూ కోవిడ్ టీకాలు వేయించుకోవాలన్నారు. ఇప్పటికే పాఠశాల సిబ్బందికి వందశాతం టీకాలు వేస్తున్నామని, త్వరలోనే చిన్న పిల్లలకు అందుబాటులోకి వచ్చే టీకాలు పిల్లలకు వేయించేలా ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటుందన్నారు. రాష్ర్టంలో ఉన్న అందరూ కోవిడ్ టీకాలు వేయించుకోవాలన్నారు. ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని టీఎస్ సింగ్ డియో కోరారు.