Savarkar Flew Out Of Jail On Birds: పాఠ్యపుస్తకంలో సావర్కర్ పాఠం.. జైలు నుంచి బుల్బుల్ పిట్టలపై సవారీ చేశారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా.. వినాయక్ దామోదర్ సావర్కర్ పోస్టర్లను ఏర్పాటు చేయడం వివాదానికి దారి తీసిన విషాన్ని మర్చిపోకముందే.. సావర్కర్‌కు సంబంధించిన ఓ పాఠం ఇప్పుడు పెద్ద దూమారమే రేపుతోంది.. కర్ణాటక పాఠ్యపుస్తంలో 8వ తరగతి విద్యార్థుల కోసం ఓ పాఠాన్ని చేర్చారు.. ఆ కన్నడ పాఠ్యపుస్తకం ప్రకారం, సావర్కర్ అండమాన్ జైలులో ఉన్న సమయంలో స్వదేశాన్ని సందర్శించడానికి పక్షి రెక్కలపై కూర్చుని ఎగురుతూ వచ్చేవాడు.. అంతేకాదండోయ్.. సావర్కర్ ఖైదు చేయబడిన సెల్‌కి ఒక కీహోల్ కూడా లేదు… కానీ,. బుల్బుల్ పక్షులు ఆయన గదిలోకి వచ్చేవి.. ఇక, సావర్కర్ వాటి రెక్కలపై కూర్చుని బయటికి వచ్చేవారు..ప్రతీ రోజూ మాతృభూమి (భారత్)ని సందర్శించేవారు అని పాఠ్యపుస్తకంలో పేర్కొనడం ఇప్పుడు తీవ్ర వివాదానికి దారి తీసింది..
Also Read
తాజాగా, ఎనిమిదో తరగతి పాఠ్యపుస్తకాన్ని సవరించింది కర్ణాటక ప్రభుత్వం.. హైస్కూల్ పాఠ్యాంశాల్లో వినాయక్ దామోదర్ సావర్కర్‌పై పాఠ్యపుస్తకాల రివిజన్ కమిటీ ఒక విభాగాన్ని చేర్చడంతో బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం “చరిత్రను తిరగరాస్తుంది” అనే ఆరోపణలపై కర్ణాటకలో ఇప్పుడు వివాదం రేగింది.. ఇది, నెట్టింట్లో ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది.. నమ్మశక్యం కానిది, పూర్తిగా వాస్తవానికి విరుద్ధంగా ఉందంటూ నెటిజన్లు కర్ణాటక బీజేపీ సర్కార్‌పై మండిపడుతున్నారు.. బీజేపీ ప్రభుత్వం చరిత్రను తిరగరాస్తోందనే ఆరోపిస్తున్నారు.. సావర్కార్ జైలులో ఉన్నాడు సరే.. ఆయన ఉన్న గదికి ఒక చిన్న రంధ్రం కూడా ఉండకపోవడం ఏంటి.. కానీ ఆ గదికి బుల్బుల్ పిట్టలు రావడం ఏంటి.. వాటి రెక్కలపై కూర్చిని ఆయన ప్రతీ రోజూ భారత్‌ను సందర్శించడం ఏంటి..? అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. కాగా, కర్ణాటక ప్రభుత్వం పాఠ్యపుస్తకాల పున:సమీక్షకు కొంతకాలం క్రితం ఆదేశించింది. రోహిత్ చక్రతీర్థ కమిటీ ఈ ఏడాది ఆ బాధ్యతలు చేపట్టింది. ఎనిమిదో తరగతి కన్నడ పాఠ్యపుస్తకంలో గతంలో ఉన్న విజయమాల రాసిన “బ్లడ్ గ్రూప్” అనే పాఠాన్ని తొలగించింది.. దాని స్థానంలో సావర్కర్ జీవితంపై పాఠాన్ని చేర్చారు. అందులో వాస్తవ విరుద్ధమైన ఘటనలు ఉండడమే ఇప్పుడు వివాదానికి కారణం అయ్యింది.
తాజావార్తలు
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
Sandeep Patil: రోహిత్, కోహ్లీ లేకపోయినా టీమిండియాకు నష్టమేమీ లేదు.. మాజీ సెలెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
-
Honor 600 Elite 5G: హానర్ 600 Elite 5G లాంచ్.. 108MP కెమెరా, 8,100mAh బ్యాటరీ, IP69K రేటింగ్
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!