PM Modi: నా మాట విని బంగారం కొనడం తగ్గించారు.. ఇప్పుడు లాభపడ్డారు..
- బంగారం కొనడం తగ్గించమని గతంలోనే చెప్పా..
- నా మాట విని డబ్బును ఆదా చేసుకున్నారు..
- ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: దేశంలో బంగారం కొనుగోళ్లపై ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరం లేకపోతే బంగారం కొనుగోళ్లను తగ్గించాలని తాను గతంలో చేసిన సూచనలను ప్రజలు పాటించారని అన్నారు. దీని వల్ల దేశానికి డబ్బు ఆదా అయిందని చెప్పారు. శనివారం లక్నోలో జరిగిన ఐదో జాతీయ కౌశల్ దీక్షాంత్ సమారోహ్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఆ సమయంలో చాలా మంది తన మాటను ఎగతాళి చేశారని, కానీ ఇప్పుడు ఆ సలహా పాటించడం వల్ల తమకు డబ్బు ఆదా అయిందని ప్రజలు చెబుతున్నారని తెలిపారు. ఒకప్పుడు దేశ ప్రజలు ఒక పూట భోజనం మానుకోవాలని శాస్త్రి పిలుపునిచ్చినప్పుడు ప్రజలు దానికి స్పందించారని అన్నారు. అదే స్ఫూర్తి ఇప్పటికీ దేశ ప్రజల్లో ఉందని వ్యాఖ్యానించారు.
యువత నైపుణ్యాల ప్రాధాన్యత గురించి మాట్లాడుతూ.. ఐఐటీ, ఐటీఐ విద్యార్థలనున ఒకే విధంగా గౌరవించాలని మోడీ సూచించారు. ఐఐటీలో చదివేవారైనా, ఐటీఐలో శిక్షణ పొందేవారైనా దేశ అభివృద్ధిలో కీలకమని అన్నారు. కేవలం డిగ్రీలు సంపాదించడం మాత్రమే భవిష్యత్తుకు సరిపోదని, విద్యతో పాటు స్కిల్స్ కూడా పెంపొందించుకోవాలని యువతకు సూచించారు. స్కిల్స్, టెక్నాలజీతోనే వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించగమని అన్నారు.
Also Read
- Delhi Municipal: బహిరంగ ప్రదేశాల్లో చెత్త కాల్చితే రూ.10 వేల ఫైన్.. ఢిల్లీలో కొత్త నిబంధనలు..
- Sanjay Raut: నాగ్పూర్ పేరును దీక్షాభూమిగా మార్చాలి.. ఉద్ధవ్ టీమ్ సంచలన డిమాండ్
- IndusInd Bank: ఇండస్ఇండ్ మాజీ సీఈఓపై వేటు.. వేతనం వెనక్కి.. కారణం ఇదే..
- Akhilesh Yadav: కాంగ్రెస్తో పొత్తుపై అఖిలేష్ కీలక ప్రకటన.!
భారత్ ఒకప్పుడు చేతివృత్తులు, సంప్రదాయ కళలు, నైపుణ్యాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని మోడీ అన్నారు. ఇలాంటి వృత్తులకు పూర్వ వైభవం తీసుకురావాలని పిలుపునిచ్చారు. బ్రిటిష్ పాలనలో సంప్రదాయ నైపుణ్యాలు, వృత్తి ఆధారిత విద్యకు ప్రాధాన్యత తగ్గిందని ఆయన విమర్శించారు. మెకాలే ప్రవేశపెట్టిన విద్యావిధానం కారణంగా ప్రాక్టికల్ విద్య కంటే కార్యాలయ ఉద్యోగాలకు అవసరమైన విద్యకు ఎక్కువ ప్రాధాన్యత లభించిందని వ్యాఖ్యానించారు. దేశంలో సుమారు 50 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని ప్రధాని మోడీ తెలిపారు. ప్రభుత్వ ప్రయత్నాల వల్ల ప్రజల్లో తమ ఆర్థిక పరిస్థితిని మెరుపరుచుకోవచ్చనే విశ్వాసం పెరిగిందని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-8 Live: నేడు మరో విశేష ఘట్టం.. నరసింహస్వామి మహాభిషేకం.. తులసీ దామోదర కల్యాణం
-
PM Modi: నా మాట విని బంగారం కొనడం తగ్గించారు.. ఇప్పుడు లాభపడ్డారు..
-
Delhi Municipal: బహిరంగ ప్రదేశాల్లో చెత్త కాల్చితే రూ.10 వేల ఫైన్.. ఢిల్లీలో కొత్త నిబంధనలు..
-
Sanjay Raut: నాగ్పూర్ పేరును దీక్షాభూమిగా మార్చాలి.. ఉద్ధవ్ టీమ్ సంచలన డిమాండ్
-
IndusInd Bank: ఇండస్ఇండ్ మాజీ సీఈఓపై వేటు.. వేతనం వెనక్కి.. కారణం ఇదే..
-
Chandrabose: ‘నాటు నాటు’ ఆస్కార్ పాటకు 19 నెలలు కష్టపడ్డా!
ట్రెండింగ్
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
-
Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!