RSS chief Mohan Bhagwat’s comments on Muslims and LGBL communities: భారతదేశంలో నివసిస్తున్న ముస్లింలకు ఎలాంటి భయాలు వద్దని, ఇస్లాం భయపడాల్సిన అవసరం లేదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ ‘ఆర్గనైజర్’, ‘పాంచజన్య’ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మేము ఒక సారి ఈ భూమిని పాలించాం.. మళ్లీ పరిపాలిస్తాం.. వంటి ఆధిపత్య ధోరణిని విడిచిపెట్టాలని హితవు పలికారు. గత 1000 ఏళ్లుగా విదేశీ దురాక్రమణదారుల నుంచి హిందువులు యుద్ధం చేస్తున్నారని అన్నారు. వీటన్నింటితో హిందు సమాజం మేల్కొందని.. యుద్ధంలో ఉన్నవారు దూకుడుగా వ్యవహరించడం సహజమే అని ఆయన అన్నారు.
Read Also: Manik rao Thackeray: తెలంగాణలో థాక్రే పర్యటన.. అక్కడకు రావాలని కోమటిరెడ్డి ఫోన్
హిందూ అనేది మన గుర్తింపు, మన జాతీయత, మన నాగరిక లక్షణం, అందరిని మనవారిగా భావించే లక్షణం అని అన్నారు. హిందుత్వ భావనను మరిచిన సమయంలో అఖండ భారతంగా ఉన్న దేశం విభజనకు గురైందని అన్నారు. ఆర్ఎస్ఎస్ రాజకీయాలతో దూరంగా ఉందని.. అయితే మన జాతీయ విధానాలు, జాతీయ ప్రయోజనాలు, హిందూ ప్రయోజనాలను ప్రభావితం చేసేత రాజకీయాల్లో మాత్రం ఎల్లప్పుడు నిమగ్నం అయి ఉందని అన్నారు. ఇంతకుముందు ఆర్ఎస్ఎస్ ను ధిక్కార ధోరణితో చూసేవారని.. ఇప్పుడు ఆ పరిస్థితులు పోయాయని ఆయన అన్నారు. ఇంతకుముందు స్వయం సేవకులు రాజకీయా అధికార స్థానాల్లో లేరు.. ప్రస్తుత పరిస్థితిలో ఇది ఒక్కటే మారిందని.. స్వయం సేవకులు రాజకీయాల్లో ఏది చేసినా.. సంఘ్ దానికి జవాబుదారీగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ఎల్జీబీటీ( లెస్బియన్, గే, బై-సెక్చువల్, ట్రాన్స్ జెండర్) వర్గాలకు మద్దతుగా పలు వ్యాఖ్యలు చేశారు. సమాజంలో వారు కూడా భాగమే అని అన్నారు. మానవులు ఉన్నంత కాలం ఈ జీవనవిధానం కొనసాగతుందని.. ఈ సమస్యల పరిష్కారానికి అనుసరించే మార్గాలు నిష్ఫలం అవుతాయని..ఆర్ఎస్ఎస్ వారికి అండగా ఉంటుందని ఆయన అన్నారు.